శంషాబాద్ పట్టణంలో తాగునీటి కటకట

 

హైద్రాబాద్, మార్చి 7, (globelmedianews.com
వేసవి ప్రారంభంలోనే శంషాబాద్ పట్టణంలో తాగునీటి కటకట మొదలైంది. తాగునీటి కోసం ప్రజలు కిలో మీటర్ల దూరం వెళ్లి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన శంషాబాద్ పట్టణంలో నీటి సమస్య ఏర్పడటం ఏమిటని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నా , సంబంధిత జలమండలి అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ మహానగరానికి ఆనుకొని ఉన్న శంషాబాద్ పట్టణంలోన నీటి తలెత్తడం విడ్డురంగా ఉందని పలు వురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అసలే వేసవి కాలం కావడంతో కనీసం బోరు నీళ్లు అయినా దొరని దుస్థితి నెలకొంది. తాగునీటి సమస్యపై స్వయంగా గ్రామ సర్పంచే ఆందోళన వ్యక్తం చేయ టం పరిస్థితి ఏ రీతిలో అర్థమవుతోంది.  నెల రోజుల క్రితమే గ్రామ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్ జలమండలి అధికారులకు నీటి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికా రుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని చెప్పవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా నీటిని అందిస్తామని ప్రగల్భాలు చెపుబుతున్నా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన శంషాబాద్‌లో నెలకొన్న నీటి సమస్యను పట్టించుకో వడంలేదని  స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 

 
శంషాబాద్ పట్టణంలో తాగునీటి కటకట

శంషాబాద్ పట్టణంలోని ఆర్‌బీనగర్, ఆదరర్శనగర్, సిద్దేశ్వర్ కాలనీ, మధురానగర్ కాలనీల్లో నీటి సమస్యతో ఆయా కాలనీల ప్రజలు తాగునీటికోసం నానా యాతన పడుతున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం విచారకరం.శంషాబాద్ పట్టణం ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామలు, బస్తీలు, కాలనీలకు మిషన్ భగీరథ నీటి వ్యవస్థ లేకపోవడంతో ఈ సమస్య తీవ్రమైనప్పటికి గ్రేటర్ పరిధిలోని జలమండలి అధికారులకు ఈ సమస్యను విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారులు తమ నిర్లక్ష్యన్ని వీడి శంషాబాద్ పట్టణ పరిధిలోని కాలనీల్లో నెలకోన్న నీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.నీటి సమస్య పరిష్కారానికి  అధికారులకు నెలక్రితమే వినతి పత్రం  సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్. శంషాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్, మధురానగర్, సిద్దేశ్వర కాలనీ, ఆర్‌బీ.నగర్‌లలో తీవ్రమైన నీటి సమస్య ఉందని, ఈ సమస్యపై గ్రామ పంచాయతీ తీర్మానంతో జలమండలి అధికారులకు గత నెల రోజుల క్రితమే  వినతి పత్రాన్ని అందజేశానని శంషాబాద్ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్ తెలిపారు.  అధికారులు ఇదుగో  చేస్తాం, అదిగో చేస్తామని చెప్పడం తప్ప వేసవి కాలంలో ప్రారంభమైన నీటి సమస్యను తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  శంషాబాద్ పట్టణంలో గల కాలనీలు, బస్తీల్లో ప్రస్తుతం క్రిష్టానీటి తాగునీటి సరఫరాను జలమండలి అధికారుల పర్యవేక్షణలో ఉందని, గతంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్నపుడు ఇంతటి సమస్య రాలేదని తెలిపారు.ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలి భాగంలోనే నీటి సమస్య ఉందని, ఔటర్ బయటి బాగంలో ఈ నీటి సమస్య లేదన్నారు. గత జనవరి 31వ తేదీన జలమండలి ప్రాజేక్టు డివిజన్ జనరల్ మేనేజర్‌కు శంషాబాద్‌లో నెలకొన్న నీటి సమస్యను తీర్చాలని వినతి పత్రం అందజేసినట్లు పేర్కోన్నారు. ప్రతి ఏడాది వేసవిలో నీటి సమస్యపై ప్రత్యేక చర్యలు తీసుకొనేవారమని, అయితే జలమండలి పరిధిలో మంచినీటి వ్యవస్థ కొనసాగుతుండటం వల్ల గ్రామ పంచాయతీ ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శంషాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ పనులు కూడా లేవని, ఈ పట్టణం పూర్తిగా జలమండలి పరిధిలోకి వచ్చిందన్నారు. అధికారులు ఇప్పటికైన అలసత్వాన్ని వీడి శంషాబాద్ పట్టణంలోని ఆర్‌బీనగర్, మధురానగర్, ఆదర్శ్‌నగర్, సిద్దేశ్వర కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చాలని కోరుతున్నామన్నారు. నీటి సమస్యపై మళ్లీ జలమండలి ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తాం, అయినా పరిష్కారం కాకపోతే ఆయా కాలనీల ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెనుకాడేది లేదన్నారు.

No comments:
Write comments