ఆదరించి,అభిమానించి, ఓటు వేసి గెలిపించండి టీడీపీ అభ్యర్థి తిక్కా రెడ్డి

 

కౌతళం, మార్చి 14, (globelmedianews.com)  
రాబోవు  అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించి అభిమానించి ఓటు వేసి గెలిపించాలని ఎన్టీఆర్ కాలనీ వాసులకు టిడిపి అభ్యర్థి తిక్కా రెడ్డి  కోరారు. కాలనీలో అడుగడుగునా కష్టాలు అడుగడుగున సమస్యలు నీటి సమస్యలు  విన్నవించుకున్నారు. రెండుసార్లు బాల నాగి రెడ్డి ని గెలిపించారు. ఈ సారి, ఒక్కసారి నాకు ఓటు వేసి  గెలిపించాలని  అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలవాలంటే తెలుగుదేశం గెలిపించాలని మరొకసారి కోరారు. ప్రతి ఒక్కరు  రెండు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని  కాలని వాసులకు మరీ మరీ కోరారు. నాకు ఓటు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ అభ్యర్థి తిక్క రెడ్డి పేర్కొన్నారు.  


ఆదరించి,అభిమానించి, ఓటు వేసి గెలిపించండి టీడీపీ అభ్యర్థి తిక్కా రెడ్డి 

ఇంటింటికి  ప్రచార కార్యక్రమంలో కౌతాళం లో ఎన్టీఆర్ నగర్, పింజారీ కాలని, ఇందిర కాలనిలో, పర్యటించారు.  తిక్క రెడ్డికి మహిళలు  మంగళ హారతి ఇచ్చి బొట్టు పెట్టి  ఆహ్వానించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ప్రకటించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. కౌతళం మండలం  పరిధిలోని అన్ని గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలుగుదేశం  చంద్రబాబును మరొక్కసారి  అవకాశం ఇచ్చి  ఓటు వేసి గెలిపించి ముఖ్య మంత్రి  అసెంబ్లీ కి పంపిస్తే  ఇంకా అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని  మమ్మల్ని ఆశీర్వదించాలని ఎన్టీఆర్ కాలని ప్రజలను కోరారు. ఈ ఇంటింటి ప్రచారంలో టిడిపి నాయకులు సీనియర్ నాయకులు ఉలి గాయ్య, గుడిసె శివన్న, చెన్న బసప్ప, వెంకటపతి రాజు, అడి వప్ప గౌడ్  సురేష్ నాయుడు, టిప్పు సుల్తాన్, కొట్రేష్ గౌడ్, రాజ నందు, నాయకులు కార్యకర్తలు,గ్రామస్తులు, పాల్గొన్నారు.

No comments:
Write comments