నగర పౌరుల పరిరక్షణలో ఈ.వి.డి.ఎం కీలక పాత్ర - విశ్వజిత్

 

హైదరాబాద్, మార్చ్ 13 (globelmedianews.com)   
గ్రేటర్ హైదరాబాద్  పౌరుల భద్రత, మెరుగైన జీవన విధానం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈ.వీ.డి.ఎం) విభాగం అత్యంత కీలక పాత్రను పోషిస్తుందని ఈ.వీ.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి అన్నారు. జీహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సంజీవయ్య పార్కు సమీపంలోని పార్కింగ్ యార్డ్‌లో ఈ.వీ.డి.ఎం ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మాట్లాడుతూ నగరంలో నడిచే హక్కు కల్పించడంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా ఫుట్‌పాత్‌లపై రికార్డు స్థాయిలో 16,092 అక్రమణలను తొలగించామని వివరించారు. 

నగర పౌరుల పరిరక్షణలో ఈ.వి.డి.ఎం కీలక పాత్ర - విశ్వజిత్

ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని 17 చెరువులు, ఒక పార్కు పరిరక్షణకు ప్రత్యేక గస్తీ దళాలను నియమించామని, నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం, తొలగించిన ఫుట్‌పాత్ అక్రమణలను తిరిగి ఆక్రమించడం చేసినందుకుగాను 294 మందికి రూ. 15.15 లక్షలను పెనాల్టిగా విధించామని పేర్కొన్నారు. విజిలెన్స్ విభాగం ద్వారా నగరంలో వివిధ అంశాలపై 72 దర్యాప్తులను చేపట్టగా 59లను పూర్తిచేసి కమిషనర్‌కు నివేదిక సమర్పించినట్టు పేర్కొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా గత ఆరు నెలలుగా దాదాపు 750కి పైగా బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో అగ్నిమాక నియంత్రణ పరికరాల ఏర్పాటుపై తనిఖీలు నిర్వహించామని, వీటిలో 600లకు పైగా ఫైర్ ఎన్.ఓ.సిలకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. నగరంలో 8 డి.ఆర్.ఎఫ్ బృందాలను 24 లొకేషన్లలో నియమించామని, ఆయా ప్రాంతాల్లో ఏవిధమైన విపత్తులు సంభవించినా ఎదుర్కొనేందుకు ఈ దళాలు తగు పరికరాలతో సిద్దంగా ఉంటారని తెలిపారు. గణేష్ నిమజ్జనం, జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశాల సందర్భంగా తగు బందోబస్తు కూడా నిర్వహించే పాత్ర పోషిస్తున్నామని విశ్వజిత్ కంపాటి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ.వి.డి.ఎం సిబ్బంది, అధికారులకు నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో విజేతలకు విశ్వజిత్ బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ.వి.డీ.ఎం అడిషనల్ ఎస్.పి సురేందర్‌రెడ్డి, డి.ఎఫ్.ఓ సుధాకర్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:
Write comments