గొల్లపూడిలో మంత్రి ఉమ పర్యటన

 

విజయవాడ, మార్చి 13, (globelmediaenws.com)
గొల్లపూడి వన్ సెంటర్ నుంచి మంత్రి దేవినేని ఉమ బుధవారం ఎలక్షన్ ప్రచారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గొల్లపూడి ప్రజలారా ఓటు తో మీ సత్తా చాటే సమయం వచ్చేసింది. ప్రజలంతా మళ్ళీ చంద్రన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.  ప్రధాన కూడళ్లలో, జన కూడళ్లలో ప్రచారరధం పై నుంచి మాట్లాడిన మంత్రి ఉమా 2014 అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. 


గొల్లపూడిలో మంత్రి ఉమ పర్యటన

2014 లో జైలు లో ఉన్న ఈ వైసీపీ దొంగ నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. పసుపు కుంకుమా, అన్నదాత సుఖీభవ వంటి పధకాలతో ఆడపడుచులను, అన్నదాతలకు ప్రభుత్వం మేలు చేసిందని అన్నారు. . మైలవరం నియోజకవర్గ తో పాటు గొల్లపూడి ని కూడా అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని మంత్రి ఉమ్మా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గొల్లపూడి టీడీపీ  పార్టీ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:
Write comments