మే నుంచి శాఖల పునర్వవ్యవస్థీకరణ

 

నల్గొండ, మార్చి 5, (globelmedianews.com)
శాఖల పునర్‌వ్యవస్థీకరణ కు అంతా సిద్ధం చేస్తున్నారు. మిగిలిన శాఖల్లోనూ పునర్‌వ్యవస్థీకరణ జరిపేందుకు సర్కారు వేగంగా పావులు కదుపుతున్నది. దీనివల్ల ఉన్నతాధికారుల కొరతను అధిగమించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు సర్కారు దృష్టి సారించింది. జిల్లాలకు అదనంగా 3659 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రతి క్యాడర్‌లోను ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై సీఎంఓ కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో శాఖాధిపతుల సమావేశం నిర్వహించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. దాంతో పాటే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం, ఎన్ని క్యాడర్‌ పోస్టులు అవసరం, వాటిని ఎలా భర్తీ చేయాలన్న దానిపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్టు తెలిసిందిఅన్ని శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చి ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించనుంది. ఈ ఏడాది మే నుంచి దీన్ని అమల్లోకి తేనున్నట్టు సమాచారం. 


మే నుంచి శాఖల పునర్వవ్యవస్థీకరణ

ఈ నేపథ్యంలోనే ఒక్కో మంత్రికి నాలుగు శాఖలను అప్పగించింది. ఆయా జిల్లాల్లో పని బారాన్ని బట్టి శాఖల విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం. నగరం, దాని చుట్టు పక్కల పరిశ్రమల శాఖకు పని ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆ శాఖను మరింత విస్తరించనున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు వేర్వేరు కాకుండా ఒకే శాఖ పరిధి లోకి తీసుకురానున్నారు. అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల లాంటి జిల్లాల్లో ఆ శాఖలను విస్తరించనున్నారు. హార్టీకల్చర్‌ డిపార్ట్‌్‌మెంట్‌లో అవసరాన్ని బట్టి కొత్త ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. పని భారం లేని చోట ఆయా శాఖల విభాగాలను ఎత్తివేయనున్నారు. అవసరాన్ని బట్టే ప్రభుత్వ విభాగాలు ఉండేలా చర్యలు చేపట్టాలని సర్కారు, ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నది. ప్రత్యేక పరిస్థితుల్లో నియమించిన ఉద్యోగులను ఆ పని పూర్తయిన తర్వాత వారికి వేరే పనులకు ఉపయోగించుకోనున్నట్టు సమాచారం. పని లేని శాఖల విభాగాలను రద్దు చేయనున్నారు. అందులోని ఉద్యోగులను పని భారం ఎక్కువగా ఉన్న చోట కు బదిలీ చేయాలని నిర్ణయించారు. భూ పరిపాలన శాఖలోని కొన్ని శాఖల ప్రాధాన్యం అవసరం పెరుగుతున్నందున ఆ శాఖలను మరింత విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. పాఠశాల విద్యను పర్యవేక్షించే బాధ్యతలు ఒకే జిల్లా విద్యాధికారి పరిధిలోకి, కుటుంబ సంక్షేమం, లెప్రసీ, ఎయిడ్స్‌ విభాగాలన్నిటినీ డీఎంహెచ్‌ఓ పరిధిలోకి, వైల్డ్‌లైఫ్‌, ఫారెస్ట్‌, సోషల్‌ ఫారెస్టు విభాగాలన్నిటినీ ఒకే అటవీ శాఖ అధికారి పర్యవేక్షణలోకి తేనున్నారు. మైనర్‌, మీడియం ఇరిగేషన్‌లకు కూడా ఒకే అధికారిని నియమించనున్నారు. ప్రతి జిల్లాల్లో ఒకే విధమైన పరిపాలన విభాగం, కుదింపు, ఉద్యోగుల సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వ శాఖల పని తీరును మెరుగుపర్చడం సమర్థ పర్యవేక్షణ, పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ పథకాలను కార్యక్రమాల సత్వర అమలు లక్ష్యంగా ప్రభుత్వ శాఖల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఒకే స్వభావం కలిగిన పనులు చేసే అధికారులు వేర్వేరు విభాగాల కింద ఉండటం వల్ల అధికారుల మధ్య సమన్వయం లోపిస్తున్నదని, ఈ గందరగోళాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్‌, తదితర శాఖలు నిత్యం ప్రజా సమస్యలతో ముడిపడి ఉన్న శాఖలు కావడంతో వేగంగా పనులు జరగాలంటే ఆయా శాఖలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేడర్‌తో సంబంధం లేకుండా జిల్లా అధికారి అనే హోదా కల్పించే అంశంపై చర్చిస్తున్నారు. అవసరాన్ని బట్టి సీనియర్లకు ప్రమోషన్లు కల్పించాలని భావిసు ్తన్నారు. ఇతమిద్దంగా అధికారికంగా నిర్ణయాలు చేయన ప్పటికీ, కసరత్తు దాదాపు పూర్తయినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆయా శాఖలను సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం పూర్తిస్థాయిలో శాఖల పునర్‌వ్యవస్థీకరణ చేయనున్నట్టు పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఐఏఎస్‌ అధికారి చెప్పారు

No comments:
Write comments