తెలంగాణలో ప్రారంభమైన కరెంట్ కష్టాలు

 

హైద్రాబాద్, మార్చి 7, (globelmedianews.com)
రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఫిబ్రవరి రెండో వారంనుంచే వేసవి మొదలు కావటందానికి తోడు రబీలో వ్యసాయ వాడకం విపరీతంగా పెరగటంతో విద్యుత్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది.విద్యుత్ తలసరి  డిమాండ్ 219 మిలియన్ యూనిట్ల నుంచి 225 మిలియన్ యూనిట్లకు పెరగటంతో రానున్న రోజులలో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఉన్న తాధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ వినియాగం కూడా మరికొంతకాలం ఎక్కువగా ఉండటంతో రానున్న రోజులలో 11000 మెగా వాట్లకు పెరిగే అవకాశం ఉందని మార్చి నెలలో ఈ వినియోగం ఇంతగా ఉంటే ఇటీవల కాలంలో ఇది ఒక రికార్డ్ అవుతుందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారి ఒకరు విజయక్రాంతి ప్రతినిధి కి వివరించారు.
రాష్ట్రంలో రైతుభంధు పధకం అమలు అవుతుండటంతో ఆరు తడి పంటలు కన్నా వారి సేద్యానికి రైతాంగం అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నారని, గతంలో రెండో పంట కింద ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చే వారని అధికారులు అభి ప్రాయ పడుతున్నారు.విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ ఎంత ఖర్చు అయినా సరే కొనుగోలు చేసి మరి రైతులకు 24 గంటలు ఉచితంగా, గృహాఅవసరాలకు, పరిశ్రమలకు నిరాకాటంగా విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించటంతో రానున్న కాలంలో డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. 


తెలంగాణలో ప్రారంభమైన కరెంట్ కష్టాలు

రాష్ట్రంలో ఎండలు మంది పోతుండటంతో గృహవినియోగం గణనీయంగా పెరుగుతోంది.దీనికి తోడు రబీలో మరికొంత కాలం వ్యవసాయ పనులు జోరుగా సాగే అవకాశం ఉండటంతో ఈనెలలోనే 11వేల మెగావాట్ల డిమాండ్‌కు  అవకాశం ఏర్పడింది. ఏప్రియల్ , మే నెలలో 11వేల  డిమాండ్ ను అదిగిమించినా ఆశ్చర్యం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.రబీ సీజన్ లో తెలంగాణ వ్యాప్తంగా రైతులు 24 గంటల విద్యుత్తును వినియోగించుకోవడం, ఎండలు కూడా ఎక్కువవుతుండడంతో సోమవారం 10,505 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. మంగళవారం ఉదయం కూడా 10,505 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. బుధవారం నుంచి డిమాండ్ మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కవై ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి.దీంతో గృహోపయోగ విద్యుత్తు వాడకం ఎక్కువవుతుంది. ఇంకా పంటలకు నీరు అవసరం ఉన్నందున వ్యవసాయానికి విద్యుత్తు ఎక్కువగానే వాడుతారు. 2016- సగటున ప్రతీ రోజు 164 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. 2017- 179 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ సంవత్సరం సగటున  189 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.కానీ ఎండాకాలం ప్రారంభమయిన తర్వాత వినియోగం 200 మిలియన్ యూనిట్లు దాటుతున్నది.  గరిష్టంగా 219 మిలియన్ యూనిట్ల వాడకం జరిగిగింది.  రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కవై ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి.దీంతో గృహోపయోగ విద్యుత్తు వాడకం ఎక్కువవుతుంది. ఇంకా పంటలకు నీరు అవసరం ఉన్నందున వ్యవసాయానికి విద్యుత్తు ఎక్కువగానే వాడుతారు. కాబట్టి రాబోయ్యే రోజుల్లో 11వేల మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. 2016-17లో సగటున ప్రతీ రోజు 164 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. 2017 179 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.ఈ సంవత్సరం సగటున నవంబర్ నాటికి 189 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. కానీ ఎండాకాలం ప్రారంభమయిన తర్వాత వినియోగం 200 మిలియన్ యూనిట్లు దాటుతున్నది. గరిష్టంగా 219 మిలియన్ యూనిట్ల వాడకం జరిగిగింది.బుధవారం కూడా పదివేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినందున, రోజు మొత్తం వాడకం 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది.

No comments:
Write comments