అభ్యర్ధికి మూడు వాహనాలకే అనుమతి

 

కడప, మార్చి 11 (globelmedianews.com )
కడప జిల్లాలో కౌటింగ్ పూర్తయ్యే వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉటుంది. మార్చి 15వ తేదీలోపు ఓటు హక్కు కోసం ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో అయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 25వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తాం. ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. ఓటు హక్కు తొలగింపులపై 35కేసులు నమోదు చేశాం. ఓక్కోక్క అభ్యర్థి నాలుగు సెట్లుగా నామినేషన్ దాఖాలు చెయ్యవచ్చని అన్నారు. పామ్ 26 అఫిడవిట్ లో మార్పులు ఉన్నాయి. 


అభ్యర్ధికి మూడు వాహనాలకే అనుమతి

అభ్యర్థి ఫోటో కూడా ఇవిఎంలపై ఉంటుంది. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి 28లక్షలు, ఎంపీ అభ్యర్థి 70 లక్షలకు ఖర్చు మించరాదు. పోలింగ్ రోజున ఒక్కో అభ్యర్థికి మూడు వాహానాలకు  అనుమతి ఇస్తాం. పర్మిషన్ లేని వాహనాలను అనుమతించే ప్రసక్తి లేదని అయన అన్నారు. స్టార్ క్యాపైనర్లు నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తే ఆ ఖర్చును పార్టీ ఖాతా క్రిందకు వస్తుంది. సెక్యూరిటీ కల్పించే బాధ్యత పోలీస్ శాఖదే. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పని సరి. ఖర్చు రోజుకు లక్ష రూపాయలకు మించరాదని వివరించారు. 

No comments:
Write comments