మొక్కజొన్న కు గిట్టుబాటు ధర కల్పించాలి

 

కాకినాడ, మార్చి 8, (globelmedianews.com)
తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామం లోని మొక్కజొన్న రైతులు మొక్కజొన్న కు గిట్టుబాటు రేటు ఇవ్వాలని లేనిపక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు గత సంవత్సరం మొక్కజొన్న కు గిట్టుబాటు ధర చెల్లిస్తామని ప్రభుత్వ కొనుగోలు దుకాణాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత తమను మొక్కజొన్న వ్యాపారులకు నమ్ముకోమని మిగిలిన మద్దతు ధర రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని ఒక్క గోకవరం గ్రామంలో సుమారు రెండు కోట్ల రూపాయల మేర మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సి ఉందని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు రైతేరాజు అని చెప్పే ప్రభుత్వం మొక్కజొన్న రైతుల ఇస్తానన్న మద్దతు ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు 


మొక్కజొన్న కు గిట్టుబాటు ధర కల్పించాలి

గత సంవత్సరం నష్టానికి మొక్కజొన్న అమ్ముకున్న తాము ఈ సంవత్సరం అన్న గిట్టుబాటు ధర లభిస్తుందని మొక్కజొన్న వేస్తే దానికి కత్తెర పురుగు రూపంలో తమకు నష్టం వాటిల్లిందని ప్రతి సంవత్సరం ఎకరాకు 20 వేల పెట్టుబడి ఈ సంవత్సరం రెండింతలు అధికమైందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇస్తానన్న గిట్టుబాటు ధర వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో క్రిమిసంహారక మందులను సేవించి ఉత్తమ ఆత్మహత్య లు చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఒకపక్క అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి గిట్టుబాటు ధర ఇచ్చామని చూపుతున్నారని తమకు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందలేదని తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు

No comments:
Write comments