సీనియర్ సిటీజన్ల ఆధ్వర్యంలో ఇంటింటా పల్స్ పోలియో కార్యక్రమం

 

జగిత్యాల మార్చి 11 (globelmedianews.com )
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంటింటా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రోజున మన సీనియర్ సిటిజన్ల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి  విశ్వనాథం, కోశాధికారి వెల్ముల ప్రకాష్, ఉపాధ్యక్షులు డాక్టర్  రాజగోపాలాచారి, మహమ్మద్ సాజిద్ లు శివ వీధి, పురానీపేట, చాకలి వాడ, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, అంగడి బజార్, ప్రాంతాలలో ప్రయాణ ప్రాంగణాలలో ప్రతీ ఇంటింటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. 


సీనియర్ సిటీజన్ల ఆధ్వర్యంలో ఇంటింటా పల్స్ పోలియో కార్యక్రమం

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఏ.మాధవి, శ్రీదేవి, బిఎస్.నర్సింగ్, విద్యార్థినిలు బుజ్జి, కీర్తన, శిరీష, జవహర్ విద్యా మందిర్ కరస్పాండెంట్ జగన్ రావు గోపాల్ రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ బెజ్జంకి బాబు, సీనియర్ సిటిజన్లు అలిశెట్టి ఈశ్వరయ్య, రఘుపతి, నారాయణ,  సత్యనారాయణ, గుండేటి గంగాధర్, కరుణ, తదితరులు పాల్గొన్నారు...

No comments:
Write comments