వైకాపా కుట్రలు ప్రజలకు చెప్పాలి

 

అమరావతి, మార్చి 08 (globelmedianews.com
ఆడబిడ్డలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చదువులో,ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టిడిపి ఘనతే. ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ ఇచ్చిందే. ఆడబిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ పెట్టింది టిడిపినే. అన్నాచెల్లెళ్ల బంధం-తెలుగుదేశంపార్టీతో అనుబంధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  శుక్రవారం నాడు అయన టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు,టిడిపి బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అప్పుడు ‘అన్న ఎన్టీఆర్’ పై కుట్రలు తిప్పికొట్టింది ఆడబిడ్డలే. ఇప్పుడు ‘చంద్రన్నపై కుట్రలను’ చిత్తు చేయాల్సింది మహిళలే మహిళలే తెలుగుదేశానికి జవజీవాలని అన్నారు. ప్రతి కుటుంబానికి నాలుగైదు రకాల ప్రభుత్వ లబ్ది. 
ప్రభుత్వ లబ్ది పొందిన అందరి ఓట్లు తెలుగుదేశానికే. రైతులు,మహిళలు,యువతరం మద్దతు టిడిపి కే. మహిళల్లో ఆత్మగౌరవం,ఆత్మ విశ్వాసం పెంచాం. ప్రతి మహిళ ఖాతాలో ఈ రోజే రూ.3,500 ఎంతో ఆనందం బోగస్ చెక్కులని అన్న వైసిపికి మహిళలే బుద్దిచెప్పాలని అన్నారు. 


వైకాపా కుట్రలు ప్రజలకు చెప్పాలి

ఇది మా చంద్రన్న ఇచ్చిన ‘పసుపు-కుంకుమ’ అని చాటాలి. ఈ 3 రోజులు అన్నిచోట్ల ర్యాలీలు, సభలు నిర్వహించాలి. ‘‘దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం’’ చేయాలి. కుప్పానికి కృష్ణా నీళ్లు చేరడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపి శివారు కుప్పానికి నీళ్లు చేరాయంటే అదొక చరిత్ర. ఈ 10 రోజుల్లోనే రాష్ట్రానికి రూ.45వేల కోట్ల పెట్టుబడులు
రాష్ట్ర ప్రతిష్ట కోసం నేను కష్టం చేస్తున్నాను. రాష్ట్రానికి అప్రదిష్ట తెచ్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారు. 
వైసిపి కుతంత్రాలకు టిఆర్ఎస్, బిజెపి ఆజ్యం పోస్తున్నాయి. టిడిపి డేటా చోరీ, ఓట్ల తొలగింపు ఈ కుట్రల్లో భాగమే. ఏపికి పెట్టుబడులు రాకుండా వైసిపి,టిఆర్ ఎస్,బిజెపి కుట్రలు చేస్తున్నాయి. ఏపి యువత ఉఫాధికి గండికొట్టేందుకే మూడు పార్టీల కుట్ర. టిడిపి సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఓట్ల తొలగింపు కుట్లోగుట్టును ఛేదిస్తాం. ఎలిబీ కోసమే ఢిల్లీవెళ్లి ఈసికి జగన్ ఫిర్యాదు. ఆ తరువాత నిస్సిగ్గుగా వైసిపి దొంగపనులు చేస్తున్నారు. టిఆర్ ఎస్ పార్టీకి డబ్బులు బాగా చేరాయి. అందుకే వైసిపికి కెసిఆర్ ఎదురు పెట్టుబడులు పెడుతున్నారు. టిడిపి అభ్యర్ధులను బెదిరించే బిజెపి నీచ కుట్రలు. ఈ 
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే బుద్ది చెబుతారని అయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కెసిఆరే. వైసిపి, టిఆర్ ఎస్ కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆరే. జగన్మోహన్ రెడ్డిని టిఆర్ ఎస్ కు డమ్మీగా చేశారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషం కెసిఆర్ కుటుంబానికి ఆంధ్రాపై విద్వేషానికి టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే రుజువని అన్నారు. తెలుగుతల్లిని అవమానించిన కెసిఆర్ తో జగన్ దోస్తీ ముందు కెసిఆర్ పెట్టుబడి పెడతారు. తరువాత జగన్ కప్పం కడతారని అన్నారు.  వైసిపి,టిఆర్ ఎస్ కుట్రలను ప్రజలకు చెప్పాలని అయన నేతలకు సూచించారు. 

No comments:
Write comments