పీవీపీ సిఫార్సుతోనే భవకుమార్ కు సీటు

 

విజయవాడ, మార్చి 20, (globelmedianews.com)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ను యలమంచిలి రవికి ఎందుకు ఇవ్వలేదు? ఆయన పార్టీలో చేరి, బలమైన నేత అని తెలిసినా టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు విజయవాడలో చర్చనీయాంశమయ్యాయి. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవాడ చేరుకున్న సమయంలోనే యలమంచిలి రవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన వైసీపీలో చేరేముందు కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. తన టిక్కెట్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి కుటుంబానికి మంచిపేరే ఉంది. యలమంచిలి రవి తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు గతంలో దేవినేని నెహ్రూను సయితం ఓడించారు. పట్టున్న నేత కావడంతో అందరూ ఆయనకే టిక్కెట్ వస్తుందని భావించారు. తనకే సీటు వస్తుందని యలమంచిలి రవి నమ్మకంగా ఉన్నారు. పీవీపీ సిఫార్సుతోనే భవకుమార్ కు సీటు

విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వంగవీటి రాధకు కూడా జగన్ ఆఫర్ చేశారు. గతంలో పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని రాధాకు జగన్ సూచించారు. కానీ రాధా అందుకు అంగీకరించలేదు.ఎందుకంటే దానికి కూడా కారణం లేకపోలేదు. యలమంచిలి రవి, వంగవీటి రాధా మంచి స్నేహితులు. తన స్నేహితుడి సీటుకు ఎసరు పెట్టకూడదని రాధా అప్పట్లో ఆలోచించి తన నిర్ణయాన్ని చెప్పేశారు. చివరకు రాధా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. రాధాకు అత్యంత సన్నిహితుడు కావడం, గెలిచినా భవిష్యత్తులో పార్టీలో ఉంటారన్న నమ్మకం లేకపోవడం యలమంచిలి రవికి టిక్కెట్ నిరాకరిచడానికి కారణంగా చెబుతున్నారు. వంగవీటిరాధా కనుక పార్టీలో ఉంటే విజయవాడ తూర్పు టిక్కెట్ ఖచ్చితంగా యలమంచిలి రవికి వచ్చేది. రాధా వెళ్లిపోవడం వల్లనే జాబితాలోనుంచి రవి పేరు వైసీపీ అధినేత తొలగించారంటున్నారు.అంతేకాకుండా ఇక్కడ దాదాపు నాలుగేళ్లుగా బొప్పన భవకుమార్ పార్టీకోసం పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. యలమంచిలి రవి పార్టీలో చేరగానే జగన్ ఆయనకు నియోజకవర్గం సమన్వయ కర్త బాధ్యతలను కూడా అప్పగించారు. దీనికి తోడు విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ పేరు ఖరారయింది. ఆయన కూడా బొప్పన భవకుమార్ కే ఓటేశారు. భవకుమార్ పీవీపికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఎంపీ అభ్యర్థి సూచన మేరకే జగన్ బొప్పనకు సీటు కేటాయించారని తెలుస్తోంది. మొత్తం మీద రాధాకు సన్నిహితుడుగా ఉండటం, పీవీపీ సిఫార్సుతోనే రవికి టిక్కెట్ దక్కలేదన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది

No comments:
Write comments