గ్రామాల్లో రేషన్ షాప్ మాల్స్

 

వరంగల్, మార్చి  13, (globelmedianews.com)
దేశంలోనే మొట్టమొదటి సారిగా సరికొత్త ప్రజా పంపిణీ వ్యవస్థను ఆవిష్కరించబోతున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11,018 చౌక దుకాణాలను సూపర్‌ మార్కెట్లుగా తీర్చిదిద్దనున్నది. పౌరసరఫరాల సంస్థ నేరుగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. వాటిని ప్రాసెసింగ్‌ చేసి అన్ని గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం. ప్రస్తుతం ధాన్యం, గోధుమలు, కొన్ని రకాల పప్పు దినుసుల పంటలను మాత్రమే కొనుగోలు చేస్తున్న ఆ సంస్థ వచ్చే ఏడాది నుంచి రైతులు పండించే ప్రతి పంటను కొనుగోలు చేయనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో తెలంగాణ నిత్యావసర సరుకులు విక్రయించడం ద్వారా పండించే అన్ని పంటలు కనీస మద్దతు ధరలకు మించిన గిట్టుబాటు అవుతుందని, దీంతో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారుఏ వస్తువులను అమ్మాలి? ఏ విధంగా అమ్మాలి? అనే దానిపై ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తిచేశారు. కాగా, డీలర్లు తమకు కూడా వేతనాలు ఇవ్వాలని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సూపర్‌ మార్కెట్లతో గ్రామీణ యువతకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. డ్వాక్రా సంఘాల భాగస్వామ్యంతో ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పనున్నారు. గ్రామాల్లో రేషన్ షాప్ మాల్స్

ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ కూడా అక్కడే జరగనుంది. చౌక దుకాణాలకు సరుకులను సరఫరా చేయనున్నారు. ఒక్క పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రారంభం కానున్న ఈ ప్రక్రియతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఒకవైపు ప్రభుత్వ చేయూత, మరోవైపు స్వయంకృషి, రైతుల కుటుంబాలకు రెట్టింపు ఆదాయం, చేతినిండా పని కల్పించడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా లబ్ధిచేకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. దీని కోసమే చౌక దుకాణాలను సూపర్‌ మార్కెట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, డీలర్లను ఏజెంట్లుగా నియమించాలా? లేక డీలర్లకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసి దానికి వారినే బాధ్యులుగా చేయాలా? అన్న తదితర అంశాల విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో మల్టీ నేషనల్‌ కంపెనీల మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌లను తట్టుకోవడం కష్టమే కాబట్టి కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులను మాత్రమే అమ్ముకునేలా వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇదంతా కొలిక్కి వస్తే హైదరాబాద్‌లో తొలుత చౌక దుకాణాలను సూపర్‌ మార్కెట్లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇక్కడ సక్సెస్‌ అయితే జిల్లాలకు దీనిని విస్తరించనున్నారు. మొత్తానికి వినియోగదారులకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందించడంతోపాటు రేషన్‌డీలర్లకూ అదనపు ఆదాయం వచ్చేలా సరికొత్త పద్ధతిలో పౌరసరఫరాల శాఖను ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం ఆ శాఖ రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నది. డీలర్ల, రైతులకు ఆదాయం పెంచాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురానున్నది. కొన్ని పంటలకు కనీస మద్దతు ధరలు అమలు కాకపోవడంతో ప్రతీయేటా రైతుల్లో ఆందోళన, మార్కెటింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో సూపర్‌ మార్కెట్లను నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. .  హైదరాబాద్‌లో 707, సిద్దిపేటలో 680, ఆదిలాబాద్‌లో 355, నాగర్‌ కర్నూల్‌లో 558, కొత్తగూడెంలో 442, జగిత్యాలలో 586, జనగామలో 355, భూపాలపల్లిలో 499, గద్వాలలో 333, కామారెడ్డిలో 577, కరీంనగర్‌లో 487, ఖమ్మంలో 669, ఆసిఫాబాద్‌లో 275, మహబూబాబాద్‌లో 553, మహబూబ్‌నగర్‌లో 804, మంచిర్యాలలో 423, మేడ్చల్‌లో 636, నల్లగొండలో 991, నిర్మల్‌లో 390, పెద్దపల్లిలో 413, సిరిసిల్లలో 344, రంగారెడ్డిలో 919, సంగారెడ్డిలో 845, సూర్యాపేటలో 609, వికారాబాద్‌లో 588, వనపర్తిలో 325, వరంగల్‌ అర్బన్‌లో 459, వరంగల్‌ రూరల్‌లో 464, నిజామాబాద్‌లో 751, యాదాద్రిలో 461, మెదక్‌లో 520 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి

No comments:
Write comments