నరేష్ ప్యానెల్ కు నాగబాబు మద్దతు

 

హైద్రాబాద్, మార్చి 9, (globelmedianews.com)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు ఒక్క రోజే గడువు ఉన్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానెల్‌కు మద్దతునిచ్చారు. ఇప్పటి వరకూ సైలెంట్ ఉన్న ఆయన.. నరేష్, రాజశేఖర్ ప్యానెల్‌కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం రాత్రి నరేష్ ప్యానెల్ సభ్యులు, నాగబాబు భేటీ అయ్యారు.  మా అధ్యక్ష పదవిని ఒకరు ఒకసారి మాత్రమే చేపట్టాలని, రెండోసారి చేపట్టడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. 
ఈ కారణంతోనే తాను రెండోసారి మా అధ్యక్షుడిగా చేయడానికి నిరాకరించానని చెప్పిన నాగబాబు.. అందరికీ అవకాశం ఇవ్వాలన్నారు. 


నరేష్ ప్యానెల్ కు నాగబాబు మద్దతు

ఈసారి నరేష్, రాజశేఖర్‌కు మద్దతు ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ప్యానల్‌లో జీవితకి మంచి పదవి ఇస్తుండటం ఆహ్వానించదగ్గ విషయమని మెగా బ్రదర్ చెప్పారు. మా జనరల్ సెక్రటరీగా నరేష్ బాగా పని చేశారన్న నాగబాబు.. అందుకే ఆయనకు మద్దతిస్తున్నానని తెలిపారు. మా అసోసియేష‌న్ గురించి ఎవ‌రు ప‌డితే వాళ్లు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే... వాళ్లు చూస్తుండిపోయారు. కానీ యాక్ష‌న్ తీసుకోలేద‌ు. ఈ ఒక్క విష‌యంలో తాను నిరాశ‌ప‌డ్డాన‌ని నాగ‌బాబు చెప్పారు. శ్రీ రెడ్డి వ్యవహారాన్ని నాగబాబు పరోక్షంగా ప్రస్తావించారు. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న శివాజీరాజా, నరేష్‌లు ప్రత్యర్థులుగా ‘మా’ ఎన్నికల్లో ఢీ కొట్టబోతున్న సంగతి తెలిసిందే. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నరేష్ ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ ద్వారా శ్రీరెడ్డి స్పందిస్తోంది. నరేష్, జీవితలను టార్గెట్‌గా చేసుకొని ఆమె విమర్శలు గుప్పిస్తోంది

No comments:
Write comments