ఇవాళ్టి నుంచి పార్లమెంటరీ సమావేశాలు

 

కరీంనగర్, మార్చి 5, (globelmedianews.com)
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాల నిర్వహణకు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు 16 నియోజకవర్గాల సమావేశాలకు స్వయంగా హాజరై.. క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. 16 ఎంపీ సీట్లలో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యాచరణ తదితర అంశాలపై సవివరంగా వివరిస్తారు. 16 సీట్లను ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా పక్కా ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రచించారు. సీఎం కేసీఆర్ రూపొందించిన కార్యాచరణను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమలుచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. మంత్రులులేని జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఈ నెల ఆరో తేదీన మొదటి సమావేశం పార్టీకి సెంటిమెంట్‌గా ఉన్న కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. 


ఇవాళ్టి నుంచి పార్లమెంటరీ సమావేశాలు

కేటీఆర్ కరీంనగర్‌లో రాత్రి బసచేస్తారు. అక్కడి నుంచి ఏడో తేదీ ఉదయం వరంగల్ నియోజకవర్గ సమావేశానికి రోడ్డు మార్గం నుంచి వెళ్తారు. వరంగల్‌లో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లుచేస్తున్నారు. హసన్‌పర్తి నుంచి వరంగల్‌లోని సమావేశ వేదిక ఓసీటీ వరకు వాహనర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత అదేరోజు నిర్వహించే భువనగిరి సభకు కేటీఆర్ హాజరవుతారు. ఎనిమిదో తేదీన మెదక్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నాయి.క్యాడర్‌కు స్పష్టత ఇవ్వడం ద్వారా పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థుల విజయానికి కృషిచేస్తారని భావిస్తున్నారు. సమావేశాల్లో నియోజకవర్గాలవారీగా కేంద్రం ద్వారా అయ్యే పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడిన తీరును వివరిస్తారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం, గజ్వేల్ వరకు రైల్వేలైను పనులు చేపట్టడం, మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బయ్యారం ఉక్కు పరిశ్రమపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ పోరాటం, భవిష్యత్ వ్యూహం గురించి వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీరాదని, కాంగ్రెస్, బీజేపీలు కలిసినా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేరని, టీఆర్‌ఎస్ గెలిచే 16 సీట్లు కీలకంగా మారుతాయని ప్రజలకు వివరిస్తారు. సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారని, పీఎం సమ్మాన్ యోజన, అన్నదాత సుఖీభవ తదితర పథకాలను ఉదహరించనున్నారు.

No comments:
Write comments