ఉపాధి హామీ పనుల్లో విషాదం..10 మంది మృతి

 

సీఎం దిగ్భ్రాంతి
నారాయణపేట ఏప్రిల్ 10 (globelmedianews.com)
నారాయణపేట జిల్లా ఉపాధి హామీ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. మరికల్‌ మండలం తీలేరులో కుంటలు తవ్వుతుండగా.. మట్టిదిబ్బలు విరిగి కూలీల మీద పడడంతో 10 మంది ఉపాధి కూలీలు మృతిచెందారు.మరికొందరు మట్టిదిబ్బల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. 


ఉపాధి హామీ పనుల్లో విషాదం..10 మంది మృతి

మట్టి దిబ్బలు తొలగించాక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.నారాయణపేట ఉపాధి కూలీల మృతి ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూలీలంతా తీలేరు గ్రామస్తులే అని సమాచారం. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments:
Write comments