ఐదు చోట్ల చొప్పున మొత్తం 35 ఈవీఎం వీవీ ఫ్యాట్ స్లిప్పులను లెక్కించాలి

 

వీవీ ఫ్యాట్లపై ఈసికి సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు 
న్యూ డిల్లీ ఏప్రిల్ 8 (globelmedianews.com)
మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతున్న వేళ.. దేశ అత్యున్నత న్యాయస్థానం వీవీ ఫ్యాట్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీ ఫ్యాట్ల యంత్రాల స్లిప్పుల్ని లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ పై కీలక ఉత్తర్వుల్ని కొద్ది సేపటి క్రితం జారీ చేసింది.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవిఎం  వీవీ ఫ్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని సుప్రీం చెప్పింది. ప్రస్తుతం ఉన్న విధానంలో ప్రతి అసెంబ్లీ నియోజకర్గంలో ఒక ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను వీవీ ఫ్యాట్ స్లిప్పులతో లెక్కిస్తుండగా.. ఈసారి మాత్రం ఐదు ఈవీఎంలలో ఈ ప్రక్రియను చేపట్టాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. 


ఐదు చోట్ల చొప్పున మొత్తం 35 ఈవీఎం వీవీ ఫ్యాట్ స్లిప్పులను లెక్కించాలి

వీవీ ఫ్యాట్ల లెక్కింపునకు ర్యాండమ్ గా ఈవీఎంలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు.తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్క దాని నుంచి ఐదు చోట్ల చొప్పున మొత్తం 35 ఈవీఎం వీవీ ఫ్యాట్ స్లిప్పులను లెక్కించాలని తేల్చారు. ప్రతి వీవీ ఫ్యాట్ లో 50 స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదని.. 35 స్లిప్పుల్ని లెక్కిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వీవీ ఫ్యాట్ లలో కనీసం యాభై శాతం స్లిప్పుల్ని లెక్కించాలని 21 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. అలా జరిగితే.. ఎన్నికల లెక్కింపునకు ఆరు రోజుల సమయం పడుతుందని ఈసీ పేర్కొంది. అయినప్పటికీ ఫర్లేదని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు పార్టీలు కోరినట్లు కాకుండా.. తనదైన శైలిలో ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం జారీ చేసిన తాజా ఉత్తర్వులపై పిటిషన్ దాఖలు చేసిన 21 రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. 

No comments:
Write comments