ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర

 

వరంగల్, ఏప్రిల్ 26, (globelmedianews.com)
గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారాలమ్మ మేడారం మహాజాతర 2020లో నిర్వహించనున్నట్టు మేడారం పూజారులు (వడ్డెల) సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. పాత వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరను పురస్క రించుకొని లక్షలాదిగా భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తారు. రాష్ట్రం నలువైపులాతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి ఈ జాతరకు ప్రజలు హాజరవుతారు. అమ్మవార్ల దర్శనభాగ్యం కోసం భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో బారులు తీరుతారు. 


 ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర

ఈ జాతరను ఎప్పుడూ నిర్వహిస్తారన్న దానిపై భక్తులు ఆతృతతో ఎదురు చూస్తుండగా ఆదివారం దీనికి సంబంధించి తేదీలను పూజారులు ప్రకటించారు.జాతరకు సంబంధించిన లేఖను కూడా వారు ఈఓకు అందచేశారు. గద్దెల సమక్షంలో పూజారులందరూ కూర్చొని ఈ తేదీలను నిర్ణయించినట్టు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు చందా గోపాల్‌రావులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి తల్లుల మహాజాతర ఉంటుందని వారు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ (బుధవారం) సారాలమ్మ, పగిడి గిద్దరాజు, గోవిందరాజులను గద్దె వద్దకు తీసుకువస్తారు. 6వ తేదీన (గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు తీసుకురావడంతో పాటు 7వ తేదీన వనదేవతలకు మొక్కులు సమర్పించుకుంటారు. 8వ తేదీన వనదేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగుస్తుందని వారు పేర్కొన్నారు

No comments:
Write comments