ఏప్రిల్ 6 నుంచి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు

 

ఖమ్మం, ఏప్రిల్ 4,  (globelmedianews.com)
శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మో త్సవాలు ఏప్రిల్6 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో ప్రధాన వేడుకలు ఏప్రిల్14న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్15న శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. త్వరలోనే అన్ని ఏర్పాట్లు ఒక కొలిక్కి వస్తాయని దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు నమస్తే తెలంగాణకు తెలిపారు. ఉగాది రోజున సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌లను కలిసి ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికలను అందజేయనున్నట్లు ఈవో తెలిపారు.తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్14న శ్రీసీతారాముల తిరుకల్యాణ మహోత్సవం, ఏప్రిల్15న మహా పట్టాభిషేకోత్సవం జరగనుంది. 


ఏప్రిల్ 6 నుంచి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఉత్సవాల నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించి వివిధశాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. దేవస్థానం భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణం లోని వివిధ కూడళ్లల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసింది. ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. త్వరలో దేవాదాయశాఖ కమిషనర్ భద్రాద్రికి వచ్చి తుది ఏర్పా ట్లను పర్యవేక్షించనున్నారు.భద్రాచలం దివ్యక్షేత్రంలో ఏప్రిల్6 నుంచి 20వ తేదీ వరకు వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్6 ఉగాది రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా యి. ఏప్రిల్10న ఉత్సవ అంకురారోపణం, మండప వాస్తు హోమం జరపనున్నారు. ఏప్రిల్11న గరుడపఠ లేఖనం, గరుడ పఠ ఆదివాసం, ఏప్రిల్12న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, ఏప్రిల్13న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్ 14న శ్రీసీతారాముల తిరుకల్యాణ మహోత్సవం, ఏప్రిల్15న మహాపట్టాభిషే కోత్సవం జరపనున్నారు. ఏప్రిల్20న చక్రతీర్థం, పూర్ణాహుతితో ఉత్సవాలు సమాప్తమవుతాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని బేడా మండపంలో అర్చకస్వాములు రామునికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చి రామాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

No comments:
Write comments