ఏప్రిల్‌ 6న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు

 

తిరుపతి, ఏప్రిల్ 5 (globelmedianews.com): 
టిటిడి పరిధిలోని తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం శ్రీవికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. 


ఏప్రిల్‌ 6న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది. అనంతరం సాయంత్రం 6.00 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8.00 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 

No comments:
Write comments