మే 8 లోగా రీ వెరిఫికేషన్, రీ కైంటింగ్ పూర్తి చేయాలి

 

హైదరాబాద్,  ఏప్రిల్ 29 (globelmedianews.com)  
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై సోమవారం  హైకోర్టులో విచారణ జరిగింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ను మే 8వ తేదీలోగా పూర్తి చేసి.. వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఇంటర్ బోర్డ్ వ్యవహారం పై హైకోర్టు లో  వాదనలు ముగిసాయి. హైకోర్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ రీ వెరిఫికేషన్ ,రీ కౌంటింగ్ కు జరుపుతామని ఇంటర్ బోర్డు  కోర్ట్ కు తెలిపింది. 

మే 8 లోగా రీ వెరిఫికేషన్, రీ కైంటింగ్ పూర్తి చేయాలి

రీ వేరిఫికేషన్ కాదు రీ వాల్యుయేషన్ జరిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి కోర్టును కోరారు. ఇంటర్ బోర్డ్ ఫలితాల పై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ను మేము చూసామన్న న్యాయస్థానం రీ వెరిఫికేషన్ రీ కౌంటింగ్ ను మే 8 లోపు ముగించి పూర్తి వివరాలను హైకోర్ట్ కు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం ను ఆదేశించింది.  వివరాలు చూసిన తరువాత 8 వ తేదీ మధ్యాహ్నం పిటీషన్ ను విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణ మే 8 కు వాయిదా వేసింది.  ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి విచారణకు హాజరయ్యారు.

No comments:
Write comments