స్త్రీశిశు సంక్షేమంలో ఏపీ దేశంలోనే ఉత్తమం

 

విస్తృత ప్రచారంలో రూరల్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్
నెల్లూరు, ఏప్రిల్ 2, (globelmedianews.com
కుటుంబ సంక్షేమం ఇంటి గృహిణి ఆర్ధిక ప్రణాళికపై పూర్తిగా ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మహిళా సాధికారతకై విశిష్టమైన పధకాలను అమలుచేసి, ప్రతీ మహిళకు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించారని, నారీశక్తిని ఎలుగెత్తి చాటుతూ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం జెండాను సగర్వంగా ఎగరేద్దామని రూరల్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ నియోజకవర్గం 31వ డివిజను కొత్తూరు, శ్రామిక నగర్, వైయస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక వీధుల్లో పర్యటిస్తూ రాష్టాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించి, తెలుగుదేశం ప్రభుత్వాన్నే మళ్లీ తీసుకురావాలని అబ్దుల్ అజీజ్ కోరారు. జనసంద్రంలా మారిన విస్తృత ప్రచారంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపుతూ నాయకులపై పూలవర్షం కురిపించారు. 


స్త్రీశిశు సంక్షేమంలో ఏపీ దేశంలోనే ఉత్తమం 

ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ మహిళలకు ఆర్ధిక చైతన్యం కల్పించేందుకు వృత్తి శిక్షణా నైపుణ్య కేంద్రాల ఏర్పాటుతో వివిధ రంగాల్లో వారికి తర్ఫీదు అందించి కుటుంబానికి వెన్నుదన్నులా నిలిచేలా చంద్రబాబు పాలనలో టిడిపి ప్రభుత్వం చక్కటి ప్రణాళికలను రూపొందించి అమలులోకి తెచ్చిందని హర్షం వ్యక్తం చేసారు.ఎన్టీఆర్ భరోసా, అన్నదాత-సుఖీభవా, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ హౌసింగ్ వంటి సంక్షేమ పధకాలతో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూర్చాలన్న ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి అహర్నిశలూ శ్రమిస్తున్నారని, తిండిపెట్టే రైతులకు పెద్దన్నగా శాశ్వత భరోసా కల్పిస్తూ, రైతు ప్రతినిధులుగా చంద్రబాబు నిలిపిన టిడిపి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుని ఆయనకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే గర్భిణులకు వైద్య ఖర్చులు అందించడంతో పాటు, పేదలు మందుల కొనుగోలుకు ప్రభుత్వమే ఆర్ధిక సాయం ఇచ్చేలా చంద్రబాబు యోచిస్తున్నారని, రాష్ట్రంలోని 15 లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీమా కల్పించడం, కల్యాణ లక్ష్మి, దుల్హన్ పధకాల మొత్తాలను లక్ష రూపాయలకు పెంచడం, చంద్రన్న బీమా మొత్తం పది లక్షలు చేయడం, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వంద యూనిట్లవరకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్ ను 150 యూనిట్లకు పెంచడం, ఎన్టీఆర్ వైద్య సేవల ఖర్చులను ప్రస్తుత 5 లక్షల నుంచి అవసరమున్నంత మేరకు పెంచే యోచన వంటి బృహత్తర ప్రణాళిక బద్ధమైన సంక్షేమ పధకాలతో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆర్ధిక భరోసా ఇస్తూ, పెద్దన్నగా నిలుస్తోన్న చంద్రబాబు సారధ్యంలోనే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉందన్న నిజాన్ని ప్రతీ ఆంధ్రుడూ బాధ్యతగా గుర్తించి సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని అబ్దుల్ అజీజ్ కోరారు. కనీవినీ ఎరుగనట్టి ఇంతటి సంక్షేమాన్ని తెలుగుదేశం పాలనలో పొందడాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ అభిమానంతో శ్రద్ధగా గమనిస్తున్నారని, చైతన్య వంతులైన ప్రజలముందు ఫాక్షనిజం, గూండాయిజం చేసే వైసీపీ నాయకుల నాటకాలు ఎట్టిపరిస్థితుల్లోనూ సాగవని ఆయన స్పష్టంచేశారు.ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సతీమణి జ్యోతి, కార్పొరేటర్లు తురకా అనిత, రాజానాయుడు, పెంచలనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు నన్నేసాహెబ్, జెన్ని రమణయ్య, బద్దెపూడి రవీంద్ర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments