వామ్మో ఎండలు...

 

కర్నూలు,  ఏప్రిల్ 26, (globelmedianews.com)
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నేల నుంచి ఎగిసే సెగ, పైనుంచి కాల్చేసే ఎండ వేడిమితో ప్రాణాలు అతలాకుతలమైపోతున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తీవ్రమైన వడగాడ్పులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఉడికిపోయాయి.. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ వడగాడ్పులు వీస్తున్నాయి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు వాటికి ఆనుకున్న ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు ప్రభావం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భానుడి తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు, తెలంగాణ, రాయలసీమలో కూడా ఎండ తీవ్రత కొనసాగింది. వాయవ్య భారతం పరిసరాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నందున ఆ ప్రభావం తెలుగు రాష్ర్టాల వరకూ విస్తరించిందిఇప్పటికే ఉభయ రాష్ట్రా‌ల్లో ఎండదెబ్బకు కొన్ని పదుల మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికే భయమేస్తోంది.వడగాల్పుల వల్ల నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. 


 వామ్మో ఎండలు...

అన్ని వయస్సుల వారు భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు. ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో  నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం అయ్యిందంటే బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎక్కడ కాసింత నీడ దొరికినా సేద తీరుతున్నారు. చల్లని పానీయాలను  సేవిస్తున్నారు. వేడి తగలకుండా గొడుగులను, కర్చీఫ్‌లను  రక్షణగా వాడుకుంటున్నారు. ఈ ఏడాది ఎండలు దారుణంగా ఉన్నాయని.. తట్టుకోలేకపోతున్నామని  నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో మండే ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పుల వల్ల నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. అన్ని వయస్సుల వారు భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు. ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో  నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం అయ్యిందంటే బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎక్కడ కాసింత నీడ దొరికినా సేద తీరుతున్నారు. చల్లని పానీయాలను  సేవిస్తున్నారు. వేడి తగలకుండా గొడుగులను, కర్చీఫ్‌లను  రక్షణగా వాడుకుంటున్నారు. ఈ ఏడాది ఎండలు దారుణంగా ఉన్నాయని.. తట్టుకోలేకపోతున్నామని  నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిణి కార్తె రాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయన్నది నానుడి. రోహిణి కార్తె రాకముందే దేశంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వేడి నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలో సాధారణంకన్నా రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి .సూర్య కిరణాల్లో అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికంగా ఉండటంతో.. ఎండలో తిరిగే వారు అనారోగ్యానికి గురవుతున్నారు. 

No comments:
Write comments