అరుణమ్మను పార్లమెంటుకు పంపుదాం

 

సినీనటుడు బిజెపి నేత బాబుమోహన్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 9 (globelmedianews.com
మంగళవారం నాడు కొత్తూరు మండల కేంద్రంలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచారం రోడ్ షో కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ,   సినీ నటుడు బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్  పాల్గొన్నారు. బీజేపీ షాద్ నగర్ ఇన్ చార్జ్  శ్రీవర్ధన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో బాబుమోహన్  మాట్లాడుతూ అభివృద్ధికి ఓటేసి అరుణమ్మ ని పార్లమెంటుకు పంపాలని ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి అరునమ్మే దీటైన నాయకురాలని అన్నారు. 


అరుణమ్మను పార్లమెంటుకు పంపుదాం

కేసీఆర్ ఓ పిట్టల దొరఅని,  పిట్టల దొర మాటలు నమ్మొద్దని అన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ ను  ముఖ్యమంత్రిని , కొడుకు,కూతురును మంత్రులను చేయడానికి కాదని ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ని మళ్ళీ ప్రధాన మంత్రిని చేయడానికని అన్నారు. దేశ సమగ్రాభివృద్ధి మోడీ ద్వారానే సాధ్యమని అన్నారు. డికే ఆరుణ మాట్లాడుతూ మీ ఆడ బిడ్డగా నాకు అవకాశం ఇవ్వండి. ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసాను జిల్లాకు సాగునీరు తెచ్చాను. కేసీఆర్  మాయమాటలతో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మిస్తామని మాట తప్పారు. జిల్లాకు ముఖ్యంగా ఈ షాద్ నగర్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసారు. మీరు నన్ను ఆశీర్వదించండి పార్లమెంట్ కు పంపండి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండని కోరారు. 

No comments:
Write comments