డీకే అరుణకు మద్దతుగా రెడ్డి జాక్, ఈడబ్ల్యూఎస్

 

మహబూబ్ నగర్, ఏప్రిల్ 04 (globelmedianews.com)  
పేదలకు విద్యా, ఉద్యోగాలలో  నరేంద్రమోడీ ప్రభుత్వం పది శాతం  రిజర్వేషన్లు  కల్పించినందుకు మద్దతుగా  ఈ పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  డీకే. అరుణకు  తెలంగాణ రాష్ట్ర రెడ్డి జాక్ కో చైర్మన్, జాతీయ ఈడబ్ల్యూఎస్ ఫోరమ్ (రెడ్డి, వైశ్య, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, తదితర వర్గాల) చైర్మైన్ కొట్టం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గంలో  అన్నీమండలాల సభ్యులు  సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. 


డీకే అరుణకు మద్దతుగా రెడ్డి జాక్, ఈడబ్ల్యూఎస్

ఈ సందర్బంగా  మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ  అన్నిఅగ్రవర్ణ కులాలు బీజేపీకి ఓటు వేసి  అరుణమ్మను గెలిపించాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో బుట్టెమ్ గారి మాధవరెడ్డి, కాంతాల నారాయణరెడ్డి , ఎద్దుల అరుణ్ కుమార్ రెడ్డి, ఛానశ్వర్ రెడ్డి , మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments