తిరుమలలో విఐపీ బ్రెక్ దర్శనం రద్దు

 

తిరుమల, ఏప్రిల్ 13  (globelmedianews.com)  
తిరుమలలో వీఐపీ దర్శనానికి సంబంధించి వారాంతంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా బ్రేక్ దర్శనాన్ని రద్దుచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.  దీనిని ఈ నెల 19వ తేదీ నుంచి అమలు చేస్తుండడంతో 18 నుంచే సిఫారసుల స్వీకరణ నిలిపివేయనున్నారు. ఏటా వేసవిలో టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 


తిరుమలలో విఐపీ బ్రెక్ దర్శనం రద్దు

తెలుగు రాష్ర్టాల్లో పోలింగు ముగియడం, రోజుల వ్యవధిలో పరీక్ష ఫలితాలు వెలువడనుండటం, వేసవి సెలవులు, ఇతర సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరగనుంది.  వారాంతాల్లో మరింత ఎక్కువగా రద్దీ నెలకొనే అవకాశం ఉంది.  ఈ క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వారాంతంలో వీఐపీ బ్రేక్ టిక్కెట్ల జారీని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

No comments:
Write comments