మధ్యమానేరు ప్రజలకు నీటి కష్టాలు

 

నిజామాబాద్, ఏప్రిల్ 23(globelmedianews.com)
మద్యమానేరు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న పొత్తూరు, కందిట్కూర్ గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు మాత్రం తీరడంలేదు.అభివృద్ది చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప నీటి కష్టాలను కూడా తీర్చడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మద్యకాలంలోనే మద్యమానేరు ప్రాజెక్టులోని నీటిని బోరు మోటర్ల ద్వారా జడ్పీటీసి సిద్ద వేణు చోరవతో నీటిని వ్యవసాయ పోలాల కోసం పంపిణీ చేశారు. అయిన నీటి కష్టాలు మాత్రం ఏమాత్రం తీరడం లేదు. గ్రామ శివారులోని బీరప్ప ఆలయంకు వెళ్లె దారిలో వ్యవసాయం పోలం కోసం వేసుకున్న పైప్‌లైన్ లీకేజి నీటిని పట్టుకోవడానికి గ్రామస్థులు వస్తున్నారుఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో ని మద్యమానేరు వాగులో సుమారు వందకు పైగా బోర్లను వేసి రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. 


మధ్యమానేరు ప్రజలకు నీటి కష్టాలు

వాగునుండి లిఫ్ట్‌ల ద్వారా పైపులైన్‌లను కిలోమీటర్ల నుండి వేసుకుని వ్యవసాయం సాగుచేస్తున్న రైతులకు అటూ వ్యవసాయానికి, మరో వైపు తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైతులు వేసిన బోర్లు, గ్రామంలోకి నల్లాల ద్వారా నీటిని సరఫరా ద్వారా పంపిణీ చేసే బోరు బావులు లో నీటి శాతం అడుగంటడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లాల బోరు ఎండిపోవడంతో గ్రామపంచాయతీ కొత్త బోరును తవ్వి బావి ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. బావి నీళ్లు మురికి నీటి కంటే దారుణంగా ఉన్నాయని , నల్లా నీళ్లను తాగకుండా వ్యవసాయ బావుల దగ్గరకు, లిప్ట్‌ల వద్ద క్యూ కడుతున్నారు. మురికి నీళ్లు వస్తున్నాయని, తాగలంటే నరకం కనపడుతుందని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లూ చెప్పిన పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.ఇప్పటి వరకు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..దీంతో ఒక్కో చుక్క నీటిని పట్టుకుని తాగునీటి కష్టాలతో గ్రామస్థులు కుస్తీ పడుతున్నారు. తలాపున మద్యమానేరు ఉన్న తాగేందుకు నీరు కరువు కావడం పై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటపోలాలు ఎండిపోయాయని, మమ్మల్ని ప్రభుత్వం అదుకోవాలని రైతులు, గ్రామస్థులు కొరుతున్నారు.

No comments:
Write comments