చివరిరోజు ఎన్నికల విస్తృత ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు

 

తుగ్గలి ఏప్రిల్ 9 (globelmedianews.com)
చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తుగ్గలి మండలంలోని  ఆర్.పి కొట్టాల,రాంపురం,మామిల్లకుంట, కోతికొండ గ్రామాలలో పర్యటించి టీడీపి ప్రభుత్వ పాలనలో నిర్వహించిన వివిధ అభివృద్ధి సంక్షేమ పతకాలను ప్రజలకి  వివరిస్తూ తమ అమూల్య మైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యాలని పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కే.ఈ.శ్యామ్ కుమార్ మరియు ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తరఫున ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగించారు.


 చివరిరోజు ఎన్నికల విస్తృత ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు

ఈ కార్యక్రమంలో భాగంగా  నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల కొరకు ప్రత్యేకమైన బ్యాంకును ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారని వారు తెలియజేశారు.ఎన్నికల్లో తప్పకుండా టిడిపి ప్రభుత్వంను గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తిమ్మయ్య చౌదరి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డిగారు,ఎంపీపీ కొమ్ము వెంకటేష్,రాంపురం వెంకట రాముడు మరియు మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments