పదహారు సీట్లు కీలకం

 

రంగారెడ్డి, ఏప్రిల్ 8 (globelmedianews.com)
తెలంగాణ లోని పదహారు సీట్లను  టిఆర్ఎస్ పార్టీ గెలిచి కెసిఆర్ చెతిలో పెడితే తెలంగాణను సస్యశామలంగా తీర్చిదిద్ది చూపుతాడని టిఆర్ఎస్ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజింత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గుడా, తోడుపల్లి గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు.  


పదహారు సీట్లు కీలకం

కేంద్ర ప్రభుత్వం తో సానుకూలంగా లేమని నిధులను అపుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుకుంటున్నారు. అందుకే కారు గుర్తుకు ఓటు వేసి నన్ను దీవించి పార్లమెంట్ కు పంపించండి.  ఐదు సంవత్సరాల అభివృద్ధి చూశారు. మరో ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. జాతీయ పార్టీల కు అదరణ తగ్గిందని,  ప్రజలు మరో పార్టీ వైపు చూస్తున్నారని,  అదే కేసిఆర్ పార్టీ అని అన్నారు. ఇప్పుడు 16 సీట్లు చాల కీలకం. 16 సీట్లతో జాతీయ పార్టీ ల మెడలు వంచేందుకు ఒక్క సీటు 10 సిట్లతో సమానమని అన్నారు.

No comments:
Write comments