ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

 

హైదరాబాద్ ఏప్రిల్ 30, (globelmedianews.com)
తండ్రి గన్ తో  తనను తానే కాల్చుకుని కొడుకు చనిపోయిన దారుణ ఘటన హైదరాబాద్ లో  చోటు చేసుకుంది. నేరేడ్ మెట్ బాలాజీనగర్ లో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మహారుద్దీన్ ప్రస్తుతం బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నారు. మహరుద్దీన్ కుమారుడు సోహెల్(22)  కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సోహెల్ తన తండ్రి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.  అయితే,  ఈ ఘటనకు ముందు తండ్రీ కొడుకుల మధ్య ఏదో విషయంలో ఘర్షణ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. నుదుటిపై బుల్లెట్ దిగడంతో వెంటనే సోహెల్ మరణించాడు.  తండ్రిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Write comments