చాటింగ్ తో జరా భద్రం

 

డీజీపీ సూచనలు
హైద్రాబాద్, ఏప్రిల్ 23, (globelmedianews.com)
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాటింగ్ చేసే వారికి కీలక సలహాలు ఇచ్చారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని స్పష్టంగా తెలిపారు.
తెలంగాణ డీజీపీ సూచనల ప్రకారం సైబర్ చాటింగ్‌లో ఏం చేయాలి?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని సీక్రెట్‌గా ఉంచాలి. (పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ ఈమెయిల్ అడ్రస్, ఫొటోలు వగైరా..)
- మీకు చాటింగ్ చేయడం ఇష్టం లేకపోతే, వారిని బ్లాక్ చేసేయండి


చాటింగ్ తో జరా భద్రం

- మీ చాటింగ్‌ను భద్రపరుచుకోవడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఉపయోగపడుతుంది
- చాటింగ్‌లో ఇంతసేపు మాత్రమే గడపాలని పరిమితి విధించుకోండి.
సైబర్ చాటింగ్‌లో ఏం చేయకూడదు?- మీకు తెలియని వారు పంపిన ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. డౌన్ లోడ్ చేయొద్దు.
- మీ స్క్రీన్ నేమ్‌ను కూడా పంపవద్దు. దాని వలన అవతలి వారు దాన్ని తెలుసుకుని మీకు అభ్యంతరకరమైన సమాచారం పంపవచ్చు.
- చాటింగ్ ద్వారా పరిచయం అయిన వారిని కలవడానికి ప్రయత్నించవద్దు.
- మీ ఫొటోలు ఎప్పుడూ చాట్ రూమ్‌లో షేర్ చేయొద్దు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. చాట్ రూమ్స్ ద్వారా సమాచారం తెలుసుకుని జేబులు ఖాళీ చేయడం, లేకపోతే ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇలా సోషల్ మీడియాపై అవగాహన కల్పిస్తున్నారు.

No comments:
Write comments