ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్

 

విజయవాడ, ఏప్రిల్ 4, (globelmedianews.com)
ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపై కొరడా ఝళిపిస్తూ.. సర్కార్‌కు రూ.100కోట్లు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో కృష్ణా నది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని మాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీతో కలిసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 


 ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్

గాంధీ, రాజేంద్ర సింగ్ తమ పిటిషన్‌లో రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే నివేదికలు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు... అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ జరిమానా విధించింది. 

No comments:
Write comments