ప్రణయ్ హత్య కేసు నిందితులకు బెయిల్ మంజూరు

 

మిర్యాలగూడ, ఏప్రిల్ 27 (globelmedianews.com)
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది సెప్టెంబర్ 14న జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో పీడీ యాక్ట్ నమోదై వరంగల్ జైలు లో రిమాండ్ ఖైదీలుగా వున్న ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హతుడు ప్రణయ్ అమృతను కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ వన్ గా ఉన్న అమృత తండ్రి తిరునగరు మారుతీ రావు,  ఏ ఫోర్ గా ఉన్న అబ్దుల్ కరీం. ఏ ఫైవ్ గా ఉన్న అమృత బాబాయ్ తిరునగరు శ్రవణ్ కుమార్ లు  పిడి యాక్ట్ కింద వరంగల్ జైలులో గత ఏడు నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 


ప్రణయ్ హత్య కేసు నిందితులకు బెయిల్ మంజూరు

ఎప్పటికప్పుడు వీరి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు బెయిల్ ఇచ్చి పట్టపగలు హత్యలు చేసే వారికి ధైర్యాన్నిఇచ్చినట్లు అయిందని ప్రణయ్ భార్య అమృత తండ్రి బాల స్వామీ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి మా కుటుంబానికి హాని ఉందని తెలిసికూడా బెయిల్ మంజూరు చేయటం దురదృష్టకరమన్నారు. డబ్బు ప్రలోభాలతో సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరు కార్చడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారని పేర్కొన్నారు. బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని. నిందితులకు తగిన శిక్ష పడేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తమ కుటుంబానికి మరింత అదనపు సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను కోరారు.

No comments:
Write comments