బడి ఈడు పిల్లలు బడిలోకే

 

కర్నూలు,ఏప్రిల్,20, (globelmedianews.com):
బడి బయట వున్న పిల్లలను తిరిగి బడిలో చేర్చించేందుకు సమిష్ఠి కృషి అవసరమని, మన బడి పోదాం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి  పటిష్ట చర్యలు చేపాట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరెట్ లోని కాన్పరెన్స్ హాలులో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, పిఓ ఎస్ ఎస్ ఏ విద్యాసాగర్,  డిఇఓ తెహరాడ సుల్తానా, మెస్మా పీడి నాగరాజునాయుడు, ఐసిడిఎస్ పీడి లీలావతి, ఇంఛార్జి సోషల్ వెల్ ఫేర్ అఫీసరు జాకీర్ హుసేన్, ఎంఐఎస్ కోఅర్డనేర్ మారుతీ,  వయెజనవిద్య ఉప సంచాలకులు జయప్రద తదితర శాఖాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. 


బడి ఈడు పిల్లలు బడిలోకే 

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో 22,458 మంది పాల్లలు బడి మానేసినట్లు గణాంక వివారాలు వున్నందున, అంగన్ వాడి, సిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలను గుర్తించి నమోదు చేయాలన్నారు.ముఖ్యంగా తల్లిదండ్రులను చైతన్యపరచి బడి బయటవున్న పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో సంద్యాల,  అదోని, కర్నూలు ప్రాంతల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండడానికి కారణాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.అలాగే సమావేశానికి హజరైనప్పుడు సమగ్ర సమాచారం లెకుండా ఎందుకు సమావేశానికి హాజరయ్యోరని అసిస్టెంట్ లేబర్ కమీషనర్లు  పై ఆగ్రహించారు. అయా శాఖాధికారి సమావేశాలను హాజరయ్యే సమయం పూర్తి సమాచారంతో పాల్గొనవలసివుంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

No comments:
Write comments