పలాసలో గెలుపు పై జోరుగా పందాలు

 

శ్రీకాకుళం, ఏప్రిల్ 26, (globelmedianews.com)
శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం చాలా డిఫ‌రెంట్‌. ఇక్కడ నుంచి ఒకే కుటుంబానికి చెందిన కీల‌క నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గౌతు ల‌చ్చన్న కుటుంబం ఇక్కడ త‌మ‌దైన ముద్ర వేసింది. టీడీపీ నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించిన ఈ కుటుంబం.. ప్రజ‌ల్లోకి త‌మ‌దైన గుర్తింపుతో ముందుకుసాగింది. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టుసాధించిన ఈ కుటుంబం గ‌త ఎన్నిక‌ల్లో గౌతు శ్యామ్‌సుంద‌ర్ శివాజీ విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో యువ నాయ‌కురాలు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. 


పలాసలో గెలుపు పై జోరుగా పందాలు 

బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ కావ‌డం, చంద్రబాబు వ‌ద్ద మంచి మార్కులు సొంతం చేసుకోవ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో ప్రజ‌ల్లో గుర్తింపు కూడా బాగానే సంపాయించుకున్నారు. పార్టీలో కూడా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. అస‌మ్మతి లేకుండానే జిల్లాలో పార్టీని న‌డిపించారు.ఇక‌, వైసీపీ త‌ర‌ఫున డాక్టర్ సీదిరి అప్పల‌రాజు ఇక్కడ నుంచి పోటీకి దిగారు. ఆయ‌న కూడా దాదాపు ఏడాదికిపైగానే దూకుడు ప్రద‌ర్శిం చారు. పార్టీలో అస‌మ్మతి ఉన్నా.. నెట్టుకువ‌చ్చారు. త‌న‌దైన శైలిలో దూకుడు ప్రద‌ర్శించారు. ఇక‌, ఎన్నిక‌ల ప్రచార స‌మ‌యంలోనూ జ‌గ‌న్ ఇక్కడ నిర్వహించిన బ‌హిరంగ స‌భ కూడా భారీ ఎత్తున స‌క్సెస్ అయింది. దీంతో ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇవ్వడంలో స‌త్తా చాటారు. ఇక‌, జ‌న‌సేన కూడా ఇక్కడ నుంచి కోత పూర్ణచంద్రరావుకు అవ‌కాశం క‌ల్పించింది. ప‌లాస మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న పూర్ణచంద్రరావు చివ‌ర్లో టీడీపీ ఎమ్మెల్యే శివాజీతో విబేధించి జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసినా.. ప్రధానంగా టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్నట్టుగానే పోటీ న‌డిచింది. మొత్తంగా చూసుకుంటే.. ప్రతి విష‌యంలోనూ ఈ రెండు పార్టీల మ‌ధ్యే జోరుగా చ‌ర్చ జ‌రిగింది. 

No comments:
Write comments