విద్యార్థుల ఆత్మహత్యలకు టీఆరెస్ సర్కారుదే బాధ్యత : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద

 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (globelmedianews.com)
విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ సర్కారు చెలగాటమాడొద్దని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారదా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంటర్మీడియట్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున అవకతవకలు, పొరపాట్లు జరిగి డాక్టర్లు, ఇంజినీర్లు కావాల్సిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని శారదా ఆందోళన వ్యక్తం చేశారు. 


విద్యార్థుల ఆత్మహత్యలకు టీఆరెస్ సర్కారుదే బాధ్యత : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నప్పటికీ  సర్కారు స్పందించకపోవడం బాదాకరన్నారు. గ్లోబరినా టెక్నాలజీస్ సంస్థ పరీక్ష పత్రాలను సక్రమంగా మూల్యాంకనం చేయకపోవడంతోనే విద్యార్థులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. విద్యార్థులకు న్యాయం జరగాలని, బోర్డులో అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగకుంటే ప్రజల మద్దతుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని శారద హెచ్చరించారు.

No comments:
Write comments