రంజాన్ కు ఏర్పాట్లు

 

హైదరాబాద్, ఏప్రిల్ 29 (globelmedianews.com)  
రాబోయే  మే, మాసంలో  ప్రారంభం కానున్న రంజాన్ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత శాఖల అధికారులను    ఆదేశించారు.   సోమవారం ఆయన సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు  ఏ.కే. ఖాన్ తో కలిసి రంజాన్ పండుగ ఏర్పాట్ల పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ, రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులలో గిఫ్ట్ ప్యాకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.    జిహెచ్ఎంసి పరిదిలోని  448 మసీదులు, 32 జిల్లాలలోని 367 మసీదులకు  గిఫ్ట్ ప్యాకులు పంపిణీ చేయడంతో పాటు, ప్రతి మసీదుకు ఇఫ్తార్ విందుకై లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలలో కలెక్టర్లు రంజాన్ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని జిహెచ్ఎంసి పరిదిలోని అన్ని మసీదు ప్రాంతాలలో సానిటేషన్, రోడ్లకు మరమ్మత్తులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. 


రంజాన్ కు ఏర్పాట్లు

అన్ని మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిహెచ్ఎంసి పరిదిలోని మసీదుల వద్ద త్రాగునీటికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలో నగరంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి బోర్డు ను తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. విద్యుత్ కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లో రాత్రి బజారు నిర్వహించే ప్రాంతాలను పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లును అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చార్మినార్ వద్దగల జిహెచ్ఎంసి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మక్కామసీదు, రాయల్ మాస్కులో మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో జి.హెచ్.ఎం.సి. కమీషనర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షా నవాజ్ ఖాసీమ్,  హైదరాబాద్ పోలీసు కమీషనర్  అంజనీకుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్  అర్విందర్ సింగ్  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:
Write comments