ఉల్లంఘనలోనూ ‘ఆమె’దే పైచేయి

 

హైద్రాబాద్, ఏప్రిల్ 24, (globelmedianews.com)
అవనిలో సగం...అన్నింటా సగం అని మహిళను చూసి మనం ముచ్చటపడుతుంటాం. నిబంధనల ఉల్లంఘనలోనూ మేము సగం అని నిరూపిస్తున్నారు ఇటీవల కొందరు యువత. ముఖ్యంగా ట్రాఫిక్‌ నియమ నిబంధనలు ఉల్లంఘించే యువతుల సంఖ్య ఇటీవల కాలంలో పెరగడం పోలీసులనే ఆశ్చర్య పరుస్తోంది. ర్యాష్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, డ్రంకెన్‌ డ్రెవ్‌ వంటి అంశాల్లో అబ్బాయిలే కాస్త స్పీడనుకుంటే మేమేం తక్కువ కాదంటున్నారు యువతులు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఈ జాడ్యం ఎక్కువన్న మాట వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో దాదాపు వెయ్యి సంస్థలు ఉండగా వీటిలో 5 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది మహిళా ఉద్యోగులే. 


ఉల్లంఘనలోనూ ‘ఆమె’దే పైచేయి

ఇటీవల కాలంలో ఎక్కువ యువత ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం, అందులో ఐటీ కారిడార్‌ మహిళలు పెద్ద సంఖ్యలో ఉండడం పోలీసులను ఆశ్చర్య పరుస్తోంది. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కడం, ఆ సందర్భంలో పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో పబ్‌లు ఎక్కువగా ఉండడంతో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు అక్కడికి వెళ్తున్నారు. మద్యం సేవించి బండి నడపడమే నేరం. ఇది చాలదన్నట్లు హెల్మెట్‌ ధరించకుండా ర్యాష్‌గా డ్రైవ్‌ చేసుకుంటూ రావడం, సిగ్నల్‌ జంపింగ్‌ చేయడం, స్టాప్‌ లైన్లను అతిక్రమించడం వంటివి యువతులు చేస్తుండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటివారిని పోలీసులు పట్టుకుంటే కొందరు బిక్క మొహం వేస్తుండగా, మరికొందరు వారితోనే గొడవ పడుతున్నారు.ఒకప్పుడు పోలీసులు ప్రత్యక్షంగా చూస్తేనే నిబంధనలను ఉల్లంఘించిన వారిని పట్టుకునే వారు. ఇప్పుడు అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనులను పట్టుకోవడం పోలీసులకు చిటికెలో పని. మరోవైపు వాహన చోదకుల నుంచి కూడా ఫిర్యాదులు పెరిగాయి. తమతోపాటు ప్రయాణించే వారు ఎవరైనా ట్రాఫిక్‌ ఉల్లంఘనకు ప్పాడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదులు అందిన వారిలో ఎక్కువ మంది యువతులు ఉండడం పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

No comments:
Write comments