మంగళగిరి పట్టాల సమస్యకు పరిష్కారం

 

ఉండవల్లి, ఏప్రిల్ 8 (globelmedianews.com)
తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. 2 వేల పెన్షన్ మూడు వేలు చేస్తాం. రెండు సార్లు పసుపు,కుంకుమ ఇచ్చాం మళ్లీ గెలిస్తే ప్రతి సంవత్సరం పసుపు, కుంకుమ ఇస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం అయన ఉండవల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ ఢిల్లీ తరహా రాజధాని అని మోడీ నీరు,మట్టి ఇచ్చి వెళ్లిపోయారు. 1500 కోట్లు అమరావతి లో డ్రైనేజ్ నిర్మాణానికి కూడా సరిపోదు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజధాని నిర్మాణాలు మొదలు పెట్టి మధ్యలోనే వదిలేశారు. అమరావతి మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అమరావతి విజయం రైతులది. భూములు ఇచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఉండవల్లి లో రైతులు భూములు ఇవ్వడానికి ఉన్న సమస్యలు,మీ డిమాండ్లు నాకు తెలుసు. ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లి నేను పరిష్కరిస్తానని అన్నారు. 


మంగళగిరి పట్టాల సమస్యకు పరిష్కారం

2000 మంది రైతు కూలీలకు రాజధాని ప్రాంతంలో 2500 పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు తొలగిస్తాం అనే పుకార్లు నమ్మకండని అన్నారు. గెలిస్తే ఏమి చేస్తామో చెప్పుకోలేని వైకాపా నేతలు లోకేష్ ఇల్లు తొలగిస్తాడు అని పుకార్లు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఒక్క ఇటుక కూడా కదలదు. వైకాపా నేతలను మంగళగిరి ప్రజలు ప్రశ్నించండి.  వైకాపా మ్యానిఫెస్టో లో అమరావతి ప్రస్తావన ఎందుకు లేదు. రాజధానిని వేరే చోటికి తరలించాలి అనే వైకాపా కుట్ర వారి మ్యానిఫెస్టో ద్వారా బయటపడింది. దొంగ ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు,మన రాష్ట్ర తాళాలు దొంగ కి ఇస్తామా అని ప్రశ్నించారు. మంగళగిరి లో ఉన్న పట్టాలు సమస్య పరిష్కరిస్తా,పేదలకు 12 వేల ఇల్లు కట్టిస్తా. మోడీ గారి తో లాలూచీ పడిన రాష్ట్రాల్లో అధికారుల మార్పు లేదు. మోడీ గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారులను మారుస్తున్నారని అన్నారు. హోదా గురించి చంద్రబాబు నిలదీసారు కాబట్టే కక్ష తో ఓడించడానికి అధికారులను పెద్ద ఎత్తున మారుస్తున్నారు. మోడీ  గుజరాత్ వెళ్లే టైం దగ్గర పడింది. మా వైపు 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారు. జగన్ జైలు పక్షి. ఆర్కే కోర్టు పక్షి. 365 రోజుల్లో 275 రోజులు ఆర్కే కోర్టులో ఉంటాడు. ఆర్కే ఓటు పొన్నూరు లో ఉంది. నేను ఉండేది మంగళగిరి, నా ఓటు మంగళగిరి లో ఉందని అన్నారు. 

No comments:
Write comments