సీఎం ఎల్వీపై మండిపడ్డ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 

చిలకలూరిపేట, ఏప్రిల్ 26 (globelmedianews.com), 
చంద్రబాబు అధికారాల్లేని ముఖ్యమంత్రి అని మాట్లాడటం పట్ల సీఎస్ రాజ్యంగయేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అధికారాలు లేని ముఖ్యమంత్రి అనటం పట్ల సీఎస్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారాలు లేవని సీఎస్ ఏ విధంగా మాట్లాడతారుని అయన ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీని నియమించింది ఎన్నికల సంఘమే. చీఫ్ సెక్రటరీ కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పని చేయాలి. సీఎస్ ఒక రాజకీయ పార్టీకి పక్షపాతిగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. సీఎస్ కుట్ర రాజకీయాల్లో భాగస్వామి కాబోతున్నారని రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతుంది. నిన్న ఎలక్షన్ సీఈవో సమీక్ష నిర్వహించినట్టు లేదు. 


సీఎం ఎల్వీపై మండిపడ్డ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

సీఎస్ సమీక్ష నిర్వహించినట్టు ఉంది. వైకాపా ఫిర్యాదు చేస్తే నిజాయితీ కలిగిన చీఫ్ సెక్రటరీ పునేఠాను బదిలీ చేశారని అన్నారు. మోదీ, అమీత్షా కుట్రలో భాగంగానే పునేఠాను బదిలీ చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సీన బాధ్యత చీఫ్ సెక్రటరీపై ఉంది. కేబినెట్ తీసుకున్న అధికారాలను ప్రశ్నించే అధికారం సీఎస్కు లేదని అయన అన్నారు. పసుపు-కుంకుమ, పింఛన్లు, అన్నదాత సుఖీభావ పథకాలను అడ్డుకోవడానికి సీఎస్కు అధికారాలు లేవు.  సీఎస్ పరిధి దాటి ప్రవర్తిస్తే మే 23 తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవల్సీ వస్తుంది. ఎలక్షన్లో చంద్రబాబు పక్షన రాష్ట్ర ప్రజలు నిలబడ్డారని అన్నారు. సీఎస్ ప్రతిపక్షం ముసుగులో పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమయింది. ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకోని అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. మోదీ, కేసీఆర్ సమీక్షాలు నిర్వహిస్తే ప్రశ్నించరు కానీ చంద్రబాబు సమీక్షాలు నిర్వహిస్తే ప్రశ్నిస్తారా ?  అని అడిగారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్ఠి పట్టించిన ఘనత మోదీకే దక్కుతుంది.  మీలాగా దోచుకోవాలి...దాచుకోవాలి అనే వ్యక్తి చంద్రబాబు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను కాపాడటంలో తెదేపా చిత్తశుద్దితో ఉంది.  దేశ ప్రజలను మోడీ నమ్మించి మోసం చేశారని ప్రత్తిపాటి అన్నారు. 

No comments:
Write comments