సూగూరులో వసంతోత్సవం.

 

ఘనంగా ముగిసిన సీతారాముల రథోత్సవం 
మంత్రాలయం, ఏప్రిల్ 15  (globelmedianews.com)
మంత్రాలయం మండల పరిధిలోని సూగూరు గ్రామంలో  సోమవారం ఉదయం శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా యువకులు చిన్నపిల్లల ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా  వసంతోత్సవం జరుపుకున్నారు.  ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా పాత ఊరిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో  విశేష పూజలు నిర్వహించారు . 


సూగూరులో వసంతోత్సవం.           

సాయంత్రం  సీతారాముల వారి  చిత్రపటాన్ని  పల్లకిలో ఉంచి  దేవాలయం చుట్టూ ఊరేగించారు . అనంతరం  మేళతాళాలతో మంగళవాయిద్యాల మధ్య  మహిళలు కళసములతో  సీతా రాముల వారి చిత్రపటాన్ని రథోత్సవం ఉంచి పూజలుగావించి  మాడ వీధులలో  ఆనందోత్సవాల మధ్య ఊరేగింపు గావించారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా  అనేక మంది భక్తులు హాజరయి రథోత్సవంలో పాల్గొన్నారు.

No comments:
Write comments