ప్రగతిభవన్‌ ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నం

 

ఆందోళనాకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
 మద్దతు పలికిన విహెచ్..అరెస్ట్ 
 రేపు కల్లెక్టరెట్ల ముట్టడికి బిజెపి,కాంగ్రెస్ పిలుపు 
హైదరాబాద్‌ ఏప్రిల్ 24(globelmedianews.com)
ఇంటర్‌బోర్డు తీరుకు నిరసనగా ప్రగతిభవన్‌ ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నించింది. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రగతిభవన్‌వైపు దూసుకెళ్లిన ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.మరోవైపు గ్లోబరీనా సంస్థ తప్పిదం వల్లే ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తూ సీపీఐ నాయకులు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో గ్లోబరీనా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 


ప్రగతిభవన్‌ ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నం

ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఐ నాయకులు.. గ్లోబరీనా సంస్థతో ఇంటర్ బోర్డు కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇంటర్‌ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బోర్డు వద్దకు వచ్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్‌బోర్డు అవకతవకలపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌ స్పందించకపోవడం బాధాకరమన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసి పరిహారం ప్రకటించాలన్నారు.కాగా  విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సంఘీభావంగా అన్ని జిల్లా కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని భాజపా నిర్ణయించగా డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రేపు అన్ని కలెక్టరేట్‌ల ఎదుట నిరసనలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ పిలుపు నిచ్చారు.

No comments:
Write comments