కృత్రిమ కొరతతో పెరుగుతున్న సిమెంట్ ధరలు

 

విజయనగరం, ఏప్రిల్ 22, (globelmedianews.com)
సిమెంట్ ధరలు ఒక్కసారిగా బస్తాకి 100రూ.లు అదనంగా పెరిగాయి. వ్యాపారులు సిండికేట్ గా కృత్రిమ కొరత  క్రియేట్ చేస్తున్నారు. దీంతో   పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపి వారి ఆశలు అడియాశలు చేశారని భవన నిర్మాణ యజమానులు లబోదిబోమంటున్నారు.సిమెంట్‌తోపాటు ఇనుము, ఇటుక, పిక్క, ఇసుక వంటి మెటీరీయల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటికల కలగానే మిగలనుంది. మార్చి నెలకు ప్రస్తుతం ఉన్న సిమెంట్ ధరలకు వ్యత్యాసం ఉంది. బస్తా ఒక్కంటికి సుమారు 100రూపాయలు పైనే ధర పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. మార్చినెలలో అన్ని వర్గాల వారికి ధర విషయంలో అన్ని కంపెనీల కలుపుకొని 5, 10 రూపాయల తేడాతో 270 రూ.లు ఉండేది. 


 కృత్రిమ కొరతతో పెరుగుతున్న సిమెంట్ ధరలు 

సిమెంట్‌తో పాటు ఇనుము, ఇటుక, ఇసుక, పిక్క తదితర మెటీరీయల్ ధరలు కూడా తీవ్రరంగా పెరిగిపోవడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ధరలుతో ఆయా మెటీరీయల్ కొనుగోలు చేయలేక గత రెండు వారాలు నుంచి భవన నిర్మాణ పనులు నిలిచిపోయన పరిస్థితి నెలకొంది. దీంతో అనకాపల్లి పరిసర గ్రామాలుతోపాటు సుదూర ప్రాంతాలు నుండి రోజుకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పట్టణంలో ఉడ్‌పేట వాటర్ ట్యాంక్ సెంటర్, గవరపాలెం పార్కుసెంటర్‌కు చేరుకొని కూలి పనులు ఎదుక్కొని వెళ్తుంటారు. అయితే పెరిగిన ధరలుతో భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వారిని కూలిపనులకు పిలిచేనాథుడే కరవయ్యారు.గతంలో 50 బస్తాలు కొనుగోలు చేసినవారు సైతం తప్పనిసరి పరిస్థితిల్లో 10 బస్తాలు కొనుగోలు చేసి భవన నిర్మాణ యజమానులు అరకొర పనులు చేయిస్తున్నారు. దీంతో సిమెంటు అమ్మకాలు 70శాతం తగ్గిపోవడంతో వ్యాపారులు అందోళన చెందుతున్నారు. ఇదే ధరలు కొనసాగితే భవిష్యత్‌లో పేద, మధ్య తరగతిప్రజలు సొంత ఇంటిని నిర్మించుకోవాలనే కలను విరమించుకొనే పరిస్థితి ఉంది. కృత్రిమ కొరత సృష్టించి ఉన్న పలంగా పెంచిన ధరలతోప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నాప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడాన్ని చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Write comments