ఇంటర్ అవకతవకలఫై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక

 

హైదరాబాద్‌ ఏప్రిల్ 27 (globelmedianews.com)  
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తలెత్తిన సమస్యలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.10 పేజీల నివిదేక సహా 46 పేజీల అనుబంధాలను కమిటీ అందించిందన్నారు. జిల్లా కేంద్రాలలో రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన క్వాలిటీ వర్క్‌ ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన తేదీని పొడిగించలేదన్నారు.


ఇంటర్ అవకతవకలఫై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక

రోజు వారిగా ఎన్ని పేపర్లు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లు అయ్యాయో తెలిపే వివరాలను ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రటరీ అశోక్‌ తెలిపారు. సచివాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాతో మాట్లాడుతూ..3 లక్షల 28 వేల మంది ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ చేస్తున్నామన్నారు. 12 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో ఉపయోగించిన స్కానర్స్‌ను ఫలితాల వెల్లడిలో ఉపయోగించాలని కోరామన్నారు. ఈ కమిటీ ఐదు రోజులుగా విచారణ చేసింది. అయితే కమిటీ ప్రధానంగా కొన్ని అంశాలనే ప్రస్తావించి, ఇంటర్‌ బోర్డు అధికారుల తప్పిదాలను ఎత్తిచూపినట్టు సమాచారం. అలాగే గ్లోబరీనా ఏజెన్సీ అర్హతలను తప్పుపట్టినట్టు తెలియవచ్చింది. గ్లోబరీనా ఏజెన్సీకి అర్హత లేకపోయినా.. టెండర్ తక్కువ కోడ్ చేసిన కారణంగా టెండర్ ఇచ్చనిట్లుగా కమిటీ తేల్చింది. దీనిపై ఏలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై కమిటీ నివేదికలో ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది. అలాగే సమస్య శాశ్వత పరిష్కారానికి పలు సూచనలు కూడా కమిటీ చేసినట్టు సమాచారం.

No comments:
Write comments