జగన్ వస్తే వర్షాలు వస్తాయి

 

 జగన్ తోనే అభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 
మంత్రాలయం, ఏప్రిల్ 9 (globelmedianews.com)
 జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జగన్   తోనే సాధ్యమని వైయస్ఆర్సీపీ మంత్రాల నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మంత్రాలయం మండల పరిధిలోని  సూగూరు  గ్రామంలో  ఆయన రోడ్ షో నిర్వహించారు. అంతకు ముందు బూదూరు, చిలకలడోణ  గ్రామాలలోనూ రోడ్ షో నిర్వహించారు. బాలనాగిరెడ్డి కి కార్యకర్తలు అభిమానులు డ్రమ్స్ తో వందలాది మంది కార్యకర్తలు  పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుంది అని  అబద్ధాలు చెప్పిన బాబు, బాబు వచ్చిన తర్వాత ఉన్నవాళ్లకి జాబులన్నీ పోయాయని ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారు. 


జగన్ వస్తే వర్షాలు వస్తాయి

బాబు వస్తే వర్షాలు కూడా కురవడం లేదని చంద్రబాబు పాలనలో తెలుగు తమ్ముళ్లు అవినీతి సామ్రాజ్యానికి తెరలేపారని అరోపించారు. అభివృద్ధి మరిచిపోయి తమ సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి తెలుగు తమ్ములు టైం సరిపోవడం లేదని అంటూ ఘాటుగా విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు పథకం ద్వారా ప్రజలందరికీ అభివృద్ధి పథకాలు అందుతాయని, వర్షాలు కూడా పుష్కలంగా కురుస్తాయని ఆయన అన్నారు. అందుకే రానున్న ఎన్నికలలో వైయస్సార్సీపి పార్టీగుర్తు అయిన ఫ్యాన్ గుర్తుకు  2 ఓట్లు అంటే ఎంపీ అభ్యర్థి ఒక ఓటు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన  నాకు  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు. తిక్కా రెడ్డి తన గన్ మేన్ లతో తనను  కాల్చుకొని అంబులెన్ లో  గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రదీప్ కుమార్ రెడ్డి నన్ను కాల్చడాన్ని ప్రజలను నమ్మిస్తున్నాడని అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. మేము మా కుటుంబం ఎలాంటిదో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని ప్రజలందరికీ అందుబాటులో ఉండి అందరి సమస్యలు పరిష్కరించే కుటుంబం మాది అని, గొడవలు పెట్టి వినోదం చూసే సంస్కృతి తిక్కారెడ్డిది  అని ఆయన అన్నారు.

No comments:
Write comments