ఇంకెన్నాళ్లు దళితులకు అవమానాలు.

 

కులం పేరుతో దూషించినవారిని  శిక్షించండి
మంత్రాలయం ఏప్రిల్ 27 (globelmedianews.com)
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా దళితులకు అవమానాలు తప్పడం లేదని, ఇంకెన్నాళ్లు దళితులు అవమాన పడుతూ చస్తూ బ్రతకాలని  కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంత్రాలయం మండల కార్యదర్శి బి అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డోన్లో దళిత మహిళలు మునెమ్మ  వనితలపై ఈశ్వరయ్య ,శేఖర్ అనే వ్యక్తులు కులం పేరుతో దూషించి అవమానించారని అన్నారు .


ఇంకెన్నాళ్లు దళితులకు అవమానాలు.

ఈశ్వరయ్య శేఖర్ లపై ఫిర్యాదు చేసి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకో తీసుకోలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. సీఐ కాసులకు కక్కుర్తిపడి దళిత మహిళలను అవమానించిన వారిని రక్షించడం కోసం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈశ్వరయ్య శేఖర్ ను వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా దళితులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాణేశ్, నరసింహులు, ఆనంద్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments