హమాలి కార్మికులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ర్యాలీ

 

మహబూబ్ నగర్, ఏప్రిల్ 9, (globelmedianews.com)
మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో హమాలి కార్మికులంతా ఐక్యంగా ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలని ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంగళవారం నాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న హమాలి సంఘం  కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. 


హమాలి కార్మికులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ర్యాలీ

తరువాత అయన హమాలి కార్మికులతో క్లాక్ టవర్ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు. హమాలి కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరం చేస్తామన్నారు.  మన బ్రతుకు దేరువు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా రావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పాలంటే 16 ఎంపీ సీట్లు గెలిపించాలని మంత్రి హమాలి కార్మికులకు విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో తెరాస పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెరకుపల్లి రాజేశ్వర్, హమాలి సంఘం అధ్యక్షుడు నర్సింహులు, గోనెల ఆంజనేయులు, గంజి లక్ష్మయ్య, గోనెల గోవర్ధన్, వెంకట్రాములు, కావాలి బాలు , కార్మికులు పెద్ద ఎత్తున  సమావేశానికి తరలివచ్చారు.

No comments:
Write comments