టిక్‌టాక్‌.. యాప్‌ను నిషేధించాలి

 

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మద్రాసు హైకోర్టు
చెన్నై ఏప్రిల్ 4 (globelmedianews.com): 
చైనాకు చెందిన టిక్‌టాక్‌.. యాప్‌ను నిషేధించాలని మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ యప్ కు ఇటీవల విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. వాట్సాప్‌ స్టేటస్‌లు.. ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లు.. ఇలా ఎక్కడ చూసిన టిక్‌టాక్‌ వీడియోలే. అయితే వీటి వల్ల అశ్లీలత పెరిగిపోతోందని, దీన్ని నిషేధించాలని ఇప్పటికే పలువురు విజ్ఞప్తి చేశారు. తాజాగా మద్రాసు హైకోర్టు కూడా టిక్‌టాక్‌ను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.టిక్‌టాక్‌పై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


టిక్‌టాక్‌.. యాప్‌ను నిషేధించాలి

ఈ యాప్‌ అశ్లీలతను ప్రోత్సహిస్తోందని, దీని వల్ల కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ముత్తు కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని అడిగింది. అంతేగాక.. ఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియాను ఆదేశించింది. చిన్నారులు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా నిబంధనలు తీసుకొస్తారా లేదా అన్నదానిపై ఏప్రిల్‌ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పెదాల కదలికతో సినిమా డైలాగ్‌లకు అభినయించడం, పాటలకు డ్యాన్స్‌లు చేయడం వంటి ఫీచర్లతో వచ్చిన ఈ టిక్‌టాక్ యాప్‌ చాలా కొద్దికాలంలోనే విశేషాదరణ పొందింది. అయితే దీని వల్ల యువత చెడుదారులు పట్టే ప్రమాదం ఉందని, దీన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. 

No comments:
Write comments