కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి అల్లోల

 

సియం కెసిఆర్ పట్టుదలకు నిదర్శనం..కాళేశ్వరం ప్రాజెక్టు..!!
హైదరాబాద్, ఏప్రిల్ 24(globelmedianews.com)
కాళేశ్వరం  ప్రాజెక్టు  మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.  


కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన  మంత్రి అల్లోల

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల వేగం చూస్తుంటే… ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదల ఎలాంటిదో అర్థం అవుతుందన్నారు .బంగారు తెలంగాణ పట్ల సీయం కేసీఆర్కు గల చిత్తశుద్దికి..కాళేశ్వరం ప్రాజెక్టు పనులే నిదర్శనం అని చెప్పారు. అదేవిధంగా  కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆహో రాత్రులు శ్రమించిన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులు, టెక్నీషియన్లు, వర్కర్లకు  శుభాకాంక్షలు తెలిపారు. రికార్డు సమయంలో పనులను పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.

No comments:
Write comments