రెండు లారీలు ఢీ…ఇద్దరు డ్రైవర్లు మృతి

 

కడప, ఏప్రిల్ 13  (globelmedianews.com)  
కడప జిల్లా రామాపురం మండలం నీలకంఠరావు పేట గ్రామం ద్ద పెట్రోల్ బంకు సమీపంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఎదురెదురుగా వచ్చాయి. 


 రెండు లారీలు ఢీ…ఇద్దరు డ్రైవర్లు మృతి

అదుపు తప్పిన ఒక లారీ మరో లారీని ఢికొందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని  లక్కిరెడ్డిపల్లి ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో ఒకరు రాయచోటికి, మరొకరు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

No comments:
Write comments