బుల్లి టీవీలో రియల్ సెక్స్

 

లండన్, ఏప్రిల్ 22  (globelmedianews.com)
టీవీల్లో అడల్ట్స్ షో గురించి మనం వినే ఉంటాం. కానీ, అవి డేటింగ్ లేదా సెక్స్ సమస్యలపై నడుస్తాయి. కానీ, ఈ రియాల్టీ షో మాత్రం అలాంటిది కాదు. ఇందులో నిజమైన భార్య భర్తలు లేదా సహజీవనం చేసే జంటలు కెమేరా ముందే సెక్స్ చేయాలి. ఆ వీడియోలను టీవీలో కూడా ప్రసారం చేస్తారు. అయితే, ఇదేదో ‘పోర్న్’ టీవీ షో అనుకుంటే పొరపాటే. దంపతులు, లేదా కలిసి జీవించే జంటల మధ్య సెక్స్ ప్రయాణం అంత సాఫీగా సాగదు. కొన్నాళ్లకే సెక్స్ అంటే ముఖం మొత్తేస్తుంది. బోర్‌గా కూడా ఫీలవ్వుతారు. ఈ నేపథ్యంలో ‘ఛానల్ 4’ అనే టీవీ ఛానల్ ‘సెక్స్ టేప్’ పేరుతో నిర్వహిస్తున్న షోలో రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్‌లు విశ్లేషిస్తారు. ఇంతకంటే ముందు వారు ఈ కార్యక్రమంలో పాల్గోడానికి దరఖాస్తు చేసుకున్న జంటల రతిక్రీడను రికార్డు చేస్తారు. బుల్లి టీవీలో రియల్ సెక్స్

ఈ సందర్భంగా వారు సెక్స్ సమయంలో తమ పార్టనర్‌తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఆసక్తికరంగా సెక్స్‌లో పాల్గొంటున్నారా లేదా? లోపాలు ఏమిటీ? తదితర అంశాలపై విశ్లేషించి ఆ జంటకు సూచనలు ఇస్తారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొనే జంట తమ లైంగిక సమస్యలు, తమ భాగస్వామితో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు. అంటే.. ఓ రకంగా మన తెలుగు టీవీల్లో వైవాహిక జీవితాలను కార్యక్రమాలకు ఇది అడ్వాన్స్ వెర్షన్ అన్నమాట. షోలో భాగంగా ఓ క్లబ్ ఓనర్ బ్రయిన్ మాథ్యూ (35), అతడి గర్ల్‌ఫ్రెండ్ విక్టోరియా ఒబాహార్(28)లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిద్దరి రతిక్రీడను పరిశీలించిన రిలేషన్‌షిప్ నిపుణులు.. వారు సెక్స్ లైఫ్‌ను చాలా బోరింగ్‌గా ఫీలవ్వుతున్నారని, చాలా యాంత్రికంగా సెక్స్‌లో పాల్గొన్నారని తేల్చేశారు. అంతేగాక.. వారికి తగిన సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ షోపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందో తెలుసుకోవాలని ఉందా? తూచ్.. ఇది ఇండియాలో మాత్రం ప్రసారం కాదు.

No comments:
Write comments